Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

చిత్రాసేన్
గురువారం, 30 అక్టోబరు 2025 (13:10 IST)
Rashmika Mandanna
ది గాళ్ ఫ్రెండ్ కథను ముందుగా సమంత కు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చెప్పారు. తనకు బాగా నచ్చింది అని కూడా రెస్పాండ్ అయింది. కానీ రష్మిక మందన్నా తో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓకే చేశాడు. ఇలా ఎందుకు జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సిందే. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నటుడేకాదు. దర్శకుడు కూడా. అసలు దర్శకుడు అవ్వాలనే సినిమారంగంలోకి ప్రవేశించాడు. మన్మథుడు 2 వంటి డిజాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించాక రొమాంటిక్ సినిమా చేయాలని ది గాళ్ ఫ్రెండ్ రాసుకున్నాడు.
 
దర్శకుడు మనసులో ఏ ఐడియా వచ్చినా, దాన్ని పేపర్ మీద పెట్టినా.. తొలుత షేర్ చేసుకునేది వెన్నెల కిశోర్, దర్శకుడు సుజిత్, సమంత తోనే. ఇదే విషయాన్ని దర్శకుడు చెబుతూ.. నేను కాలేజీ రోజుల్లో వుండగా ఓ సంఘటన జరగడంతో దాన్ని పేపర్ పై పెట్టాను. దాన్ని ఓటీటీ కోసం కరోనా టైంలో ఆహా.. వారు అడిగారు. ఇచ్చాను. ఆ కథ అరవింద్ గారికి బాగా నచ్చి థియేటర్ ఫిలిం ఇది అంటూ ఆపారు. అలా 2025 దాకా సాగింది.
 
ఇక ముందుగా సమంతకు కథ పంపాను. తను చాలా ఎగ్జైట్ అయింది. ఇది నేను చేయాల్సిన సినిమా. కానీ పాత్రలో కొన్ని లిమిట్స్ వున్నాయి. అవి నాకు సరిపడుతుందోలేదో అని అనుమానంగా వుంది అని చెప్పింది. ఆ తర్వాత రష్మిక మందన్నాకు చెప్పడానికి ట్రై చేశాను. హిందీ లో యానిమల్ సినిమా చేస్తుంది. ఓ రోజు కథ చదివి ఈ కథ నేనే చేస్తాను. అంటూ పట్టుపట్టింది. అలా రష్మిక తెరపైకి వచ్చింది. ఈ కథలో నా అనుభవాలు, రశ్మిక అనుభావాలు కూడా వున్నాయి. కథను చదివాక తనకు బాగా కనెక్ట్ అయిందనీ, కొన్ని సంఘటనలు తనకూ జరిగాయని రష్మిక చెప్పడం విశేషం. అలా రష్మిక సినిమా చేసింది అంటూ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ వివరించారు.
 
ఈ సినిమా ట్రైలర్ లో పెద్ద చెట్టు వేళ్ళు రష్మికను చుట్టేసి వుంటాయి. ఆ సీన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథకు కూడా బాగా యాప్ట్ అయ్యే సీన్ అది. సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

వరదలో చిక్కుకున్న 15 మందిని కాపాడిన రెస్క్యూ బృందానికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

మొంథా తుఫాను.. రవాణాకు తీవ్ర అంతరాయాలు.. ముగ్గురు కొట్టుకుపోయారు... ఒకరినే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments