Rahul Ravindran, Rashmika Mandanna
రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - నేను స్టూడెంట్ గా హాస్టల్లో ఉండే రోజుల్లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. దాన్ని కొన్నేళ్ల క్రితం స్టోరీగా రాసుకున్నా. మీరు ఇప్పుడు ట్రైలర్ లో ఏం చూశారో అదే సినిమా. ఇంటెన్స్ ఎమోషన్ తో ఉంటుంది. రిలేషన్ షిప్ ట్రై చేయాలనుకునే వారు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి ఆ ఎమోషన్ తో బయటకు వస్తారు. మూవీ రియల్ గా, రూటెడ్ గా, ఇంటెన్స్ గా , ఎమోషనల్ గా ఉంటుంది. నా టీమ్ అందరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రశ్మిక తమ పర్ ఫార్మెన్స్ తో కథకు లైఫ్ ఇచ్చారు.
ఇలాంటి యాక్టర్స్ దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమని చెప్పాలి. నేను మానిటర్ వెనకాల కూర్చుని వీళ్ల పర్ ఫార్మెన్స్ చూస్తూ ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఆడియెన్ కావడం హ్యాపీగా ఉంది. సినిమాలో నేనూ ఒక రోల్ చేశాను. ఇది రెగ్యులర్ ఫార్మేట్ లవ్ స్టోరీ కాదు. జెన్యూన్ గా ఒక కథ చెప్పాలని మేమంతా ప్రయత్నించాం. ఇలాంటి మూవీస్ కు మీ సపోర్ట్ కావాలి. అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా కథను రాహుల్ నాలుగేళ్ల క్రితం చెప్పాడు. ఆహాకు వెబ్ సిరీస్ లా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. కానీ ఇలాంటి మంచి కథతో సినిమా చేస్తేనే బాగుంటుందని అనిపించేది. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా ఈ కథ గురించి రాహుల్ కు గుర్తుచేసేవాడిని. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అంత హెవీ పర్ ఫార్మెన్స్ ఎవరు చేస్తారని అనుకున్నప్పుడు రశ్మిక మాత్రమే చేయగలదు అని ఆమెను తీసుకున్నాం. తను నాకు కూతురు లాంటిది. రశ్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తాయి. ఈ సినిమా చూశాకే దీక్షిత్ ఎంత మంచి పర్ ఫార్మర్ అనేది ఆడియెన్స్ తెలుసుకుంటారు. రశ్మిక, దీక్షిత్ తో ఒక ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు రాహుల్. అతన్ని చూస్తే ఇలాంటి సినిమా ఇతను చేశాడా అనిపిస్తుంది. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను గెస్ట్ గా తీసుకొద్దాం. అన్నారు.