Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాను ఊపేస్తున్న "సలార్" టీజర్

Webdunia
గురువారం, 6 జులై 2023 (09:43 IST)
ప్రపంచ వ్యాప్తంగా రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'సలార్ పార్ట్ 1 - సీజ్ ఫైర్' టీజర్ విడుదలైంది. 'కేజీఎఫ్' చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడిన వెంటనే ఈ సినిమాపై భారీ అంచాలు నెలకొన్నాయి.
 
గురువారం ఉదయం 5.12 గంటలకు టీజర్‌ను విడుదల చేశారు. అందరూ ఊహించినట్టే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. 'బాహుబలిని' మించి ప్రభాస్‌ను ఎలివేట్ చేసేలా ఈ చిత్రం ఉందనే విషయం టీజర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు 'సలార్' టీజర్ ట్విట్టర్‌ను షేక్ చేస్తోంది. 
 
టీజర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది. ట్విట్టర్ ఇండియాలో టాప్ పొజిషన్ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ కూడా టాప్ 2 పొజిషన్‌లో ట్రెండ్ అవుతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
 
ఒకే ఒక డైలాగ్..!
సినిమా ఎలా ఉండబోతోంది? ప్రభాస్ క్యారెక్టర్ ఎంతగా ఎలివేట్ చేశారు? అనేది ఒక్క డైలాగ్ మేకర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం.. కానీ జురాసిక్ పార్కులో కాదు.. ఎందుకంటే అక్కడ ఉండేది.. అంటూ టీనూ ఆనంద్ డైలాగుతో మొదలైన టీజర్ అభిమానుల్లో అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ మూవీలో ప్రభాస్ మాస్ విశ్వరూపం కనిపించబోతోందని చెప్పకనే చెప్పేసింది.
 
కేజీఎఫ్ మార్కు టేకింగ్ ఉన్న సీన్స్ ప్రభాస్‌ను కనిపించీ కనిపించనట్టుగా క్షణకాలంలో ఇంట్రడ్యూస్ చేయడం మరో విశేషం. నేటి తరం, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఏ కోరుకుంటున్నారో అదే తెరపై చూపించేందుకు దర్శకుడు పక్కా ప్రణాళిక వేసుకున్నాడనేది టీజరులోనే తెలిసిపోయిందనేది అభిమానులు చెప్పే మాట. 
 
టీజర్ చివరలో పృథ్వీరాజ్ ఇంట్రడక్షన్ కూడా అదుర్స్ అనేది పబ్లిక్ టాక్. ఈ టీజరులో ప్రభాస్ అభిమానుల్లో ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకోవడం పక్కా అనడంలో ఎటువంటి అతిశయోక్తీ ఉండదేమో. 'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్' సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహసన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments