Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ ఆర్ట్స్ #NKR21 నందమూరి కళ్యాణ్ రామ్ అనౌన్స్ మెంట్

Advertiesment
NKR21 announcement look
, బుధవారం, 5 జులై 2023 (17:58 IST)
NKR21 announcement look
నందమూరి కళ్యాణ్ రామ్ టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటారు. యువ దర్శకులు, వైవిధ్యమైన కథలతో ఆయన చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి సైన్ చేశారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ చేశారు. "అలా ఎలా" అనే ఫీల్ గుడ్ రొమ్-కామ్‌ని నిర్మించిన తర్వాత అశోక క్రియేషన్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ ని నిర్మిస్తోంది. వారు కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ (NTR ఆర్ట్స్) బ్యానర్‌తో కలిసి పని చేస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 2 గా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ప్రొడక్షన్ హౌస్ తొలి చిత్రం పెద్ద హిట్ అందించిన తర్వాత కూడా హై బడ్జెట్ చిత్రాలను నిర్మించాలనే ఆకాంక్షతో కొంతకాలం వేచి చూశారు. అలాగే నందమూరి కళ్యాణ్‌రామ్‌తో కలసి పని చేయాలనుకుంటున్నారు.
 
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ చిత్రం ప్రముఖ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాల పరంగా ఇది భారీగా ఉంటుంది.
 
కళ్యాణ్ రామ్ తన పంచ్ పవర్‌ను చూపించే మాస్-ఆపీలింగ్ పోస్టర్ ద్వారా ఈ చిత్రం అవుట్-అండ్-అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇది సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తుంది. కళ్యాణ్ రామ్‌ని మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించడానికి ప్రదీప్ చిలుకూరి ఆకట్టుకునే కథను రాశారు. డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే.
 
హరికృష్ణ భండారి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాళోజీయే తమ కళ్ళ ముందు నడయాడుతున్నట్టుగా ఫీలయ్యారు : ప్రభాకర్ జైనీ