Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి, రాజన్న సినిమాల అనుభవంతో రుద్రంగి తీసా: డైరెక్టర్ అజయ్ సామ్రాట్

Director Ajay Samrat
, బుధవారం, 5 జులై 2023 (16:42 IST)
Director Ajay Samrat
జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన "రుద్రంగి" అనే సినిమా ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమత మోహన్ దాస్, విమల రామన్, గానవి లక్ష్మన్ లు నటించారు. జులై 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు అజయ్ సామ్రాట్ మీడియాతో ముచ్చటించారు. 
 
నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ఈ కథను రాసుకున్నాను. పర్టిక్యులర్‌గా ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకోలేదు. తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో చూపించిన సమస్యలు ఎక్కడ ఉంటే.. అక్కడి నుంచి ఈ కథను తీసుకున్నట్టే అవుతుంది. ఆ సమస్యలు ఎక్కడ వచ్చినా ఇలాంటి పోరాటాలే జరుగుతాయి. దొరల అణిచివేతల మీద ఇది వరకే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇది పూర్తి భిన్నంగా రాబోతోంది. ఎమోషనల్ ఫ్యామిలీ, సోషల్ డ్రామాగా తీశాను.
 
పెట్టిన ఖర్చుకంటే విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. కారెక్టర్ మూడ్, లైటింగ్, డైలాగ్ మూడ్, టోన్ మూడ్ ఇలా ప్రతీ ఒక్క చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాను. నేను, కెమెరామెన్ కలిసి ఎన్నో చర్చించుకుని సినిమా చేశాం. ఆరేడు నెలలు ప్రీ ప్రొడక్షన్ పనులే చేశాం. షూటింగ్ తక్కువ టైంలోనే చేశాం.
 
కథ వినేందుకు మొదట్లో ఎవ్వరూ ముందుకు రాలేదు. కరోనా టైంలో జగపతి బాబు గారికి కథ చెప్పాను. బాగుందని అన్నారు. లాక్ డౌన్‌లో మళ్లీ కథ చెప్పాను. ఆయన ఈ సినిమాకు చాలా కష్టపడ్డారు
 
బాహుబలికి పని చేశాను అని నేను ఎక్కడా చెప్పుకోలేదు. నన్ను నేను సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవడం నాకు నచ్చదు. ఎలానో నాకు తెలీదు. బాహుబలి, రాజన్నకు డైలాగ్ రైటర్‌గా పని చేశాను. రాజమౌళితో నాకు ప్రొఫెషనల్‌గానే పరిచయం ఉంది.
 
సినిమా బాగుంటే జనాలు చూస్తుంటారు. కాంతారాను ఎక్కడో తీశారు. ఇక్కడ ఓ పెద్ద సంస్థ తీసుకుని రిలీజ్ చేసింది. ప్రమోషన్స్ కూడా అంతగా చేయలేదు. కానీ జనాలు చూశారు. ఈ సినిమా మీద నా నమ్మకం ఏంటో జనాలు చూసి చెబుతారు. విమర్శలను కూడా నేను స్వీకరిస్తాను.
 
నాకు మమతా మోహన్ దాస్ గారంటే చాలా ఇష్టం. యమదొంగ సినిమాలో చేసిన యాక్టింగ్ నాకు ఇష్టం. మంచి సింగర్, డ్యాన్సర్. ఆమెకు అరుంధతి మిస్ అయింది. ఈ సినిమాను మిస్ అవ్వకూడదని ఓ వ్యక్తి నాతో అన్నారు. ఆమెకు క్యాన్సర్ అని తెలిసి ఎంతో బాధపడ్డాను. క్యాన్సర్ నుంచి కోలుకున్నారని తెలిసి అప్రోచ్ అయ్యాను. పదేళ్ల నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు.. అప్రోచ్ అయినందుకు థాంక్స్ అని అన్నారు. ఐదు నిమిషాలు చెప్పిన కథ విని వెంటనే ఓకే అన్నారు. మరో పాత్ర కోసం విమలా రామన్‌ను అప్రోచ్ అయ్యాను.
 
రుద్రంగిలో జగపతి బాబు గారు ఎక్కువగా లీనమయ్యారు. రోజూ పన్నెండు గంటలకు షూటింగ్‌కు రమ్మంటే.. ఉదయం ఎనిమిది గంటలకే వచ్చి సెట్‌లో ఉండేవారు. ఆయన నన్ను ఎక్కువగా నమ్మారు. 
 
అరవై రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. నిర్మాత నన్ను ఎప్పుడూ సినిమా తీయమని అడుగుతూనే ఉంటాడు. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని సలహా ఇచ్చేవాడిని. రసమయి గారికి సినిమా తీయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చింది. లాక్ డౌన్‌లో మళ్లీ కలవడంతో ఈ సినిమా మొదలైంది. నిర్మాతగా ఆయన ఏం చేయగలడో అన్నీ చేశారు.
 
నా వద్ద ఇంకా కథలున్నాయి. రుద్రంగి సినిమా తరువాత వాటి గురించి చెబుతాను. ఈ సినిమా మైత్రీ సంస్థ ద్వారా విడుదల అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

100 రోజులు కాదు 100 అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న బలగం