Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ `ఛ‌త్ర‌ప‌తి` త‌ర్వాత ధనుష్‌ ‘కర్ణన్‌’ రీమేక్‌తో సాయి శ్రీనివాస్‌

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (16:02 IST)
Sai srinivas
తమిళంలో విజ‌యం సాధించిన ‘రాట్స‌సన్‌’ చిత్రానికి  తెలుగు రీమేక్‌ ‘రాక్షసుడు’లో హీరోగా నటించి బిగ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నారు టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. తాజాగా తమిళ హిట్‌ ‘కర్ణన్‌’ సినిమాని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. తమిళంలో ధనుష్‌ నటించిన ‘కర్ణన్‌’ చిత్రాన్ని మారి సెల్వరాజ్‌ డైరెక్ట్‌ చేశారు. తమిళనాడులో ఇటీవ‌ల‌ ఈ చిత్రం విడుదలై  విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు సాధించింది.
 
ధనుష్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీగా తెర‌కెక్కిన‌‘కర్ణన్‌’మూవీని ఇటీవల బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ వీక్షించి ఈ సినిమా కథ, ఎగ్జిక్యూషన్ త‌న‌కి బాగా న‌చ్చ‌డంతో ‘కర్ణన్‌’ తెలుగు రీమేక్‌లో నటించాలని డిసైడ్‌ అయ్యారు. ‘కర్ణన్‌’ సినిమా తెలుగు రీమేక్‌ దర్శకుడు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించ‌నున్నారు.
 
ప్రభాస్‌ కెరీర్‌ రేంజ్‌ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకువెళ్లిన ‘ఛత్రపతి’ సినిమా హిందీ రీమేక్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బాలీవుడ్‌కు గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఇప్ప‌టికే మొదలు కావాల్సింది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేశారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మేకర్స్‌ ఆల్రెడీ హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేశారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత ధనుష్‌ కర్ణన్‌ తెలుగు రీమేక్‌ వర్క్స్‌ ను మొదలు పెట్ట‌నున్నారు సాయిశ్రీనివాస్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments