Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా హీరోగా ఆచంట గోపినాథ్ సినిమా

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (15:49 IST)
Rana, gopinath
'లీడర్', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రిస‌  కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుంది.  
 
నందమూరి బాలకృష్ణ హీరోగా 'టాప్ హీరో', 'దేవుడు', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ', రాజేంద్రప్రసాద్ హీరోగా 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ 'ఇమైక్క నొడిగల్'ను తెలుగులో 'అంజలి సిబిఐ'గా విడుదల చేశారు. కొంత విరామం తర్వాత రానా దగ్గుబాటి హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు మాట్లాడుతూ "ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా సినిమా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ కథ ఓకే అయ్యింది. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments