Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్ దర్శకుడు కేవీ ఆనంద్ మృతిపై రజనీ - శంకర్ సంతాపం

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (14:25 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు కేవీ ఆనంద్ మృతిపై తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయ‌న అకాల మ‌ర‌ణం ఎంత‌గానో బాధించింది అని ప‌లువ‌రు ప్ర‌ముఖులు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. 
 
ముఖ్యంగా, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న ట్విట్ట‌ర్‌లో "గౌర‌వనీయులైన కేవీ ఆనంద్ మ‌ర‌ణం దిగ్భ్రాంతిని క‌లిగించింది. మ‌నంద‌రిని విడిచి వెళ్ల‌డం చాలా బాధాక‌రం. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను. కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను" అంటూ ర‌జ‌నీకాంత్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న ట్వీట్‌లో "ఈ వార్త నిజంగా షాకిచ్చింది. నా హృద‌యం చాలా భారంగా అనిపిస్తుంది. ఈ విష‌యాన్ని అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నాను. అద్భుత‌మైన సినిమాటోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కుడిని కోల్పోయాను. ఈ న‌ష్టాన్ని ఎప్ప‌టికీ భ‌ర్తి చేయ‌లేము. నా ప్రియ‌మైన స్నేహితుడి మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నాను" అని శంక‌ర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
"నా తొలి మూవీ సినిమాటోగ్రాఫ‌ర్ అకాల మ‌ర‌ణం చెంద‌డం షాక్‌కు గురి చేసింది. ఆయ‌న మ‌ర‌ణించార‌నే వార్త‌ని అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నాం. అత‌నికి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను" అంటూ విశాల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా, ప్రముఖ తమిళ దర్శకుడు, తన చిత్రాల డబ్బింగ్ వర్షన్లతో దక్షిణాదికి సుపరిచితుడైన కేవీ ఆనంద్ ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి కోలీవుడ్ కు దిగ్భ్రాంతిని కలిగించింది. 
 
సూపర్ హిట్ చిత్రాలు ప్రేమదేశం, ఒకే ఒక్కడు, శివాజీ తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన, ఆపై కణా కండేన్ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆపై సూర్యతో అయాన్ (తెలుగులో వీడొక్కడే) చిత్రానికి దర్శకత్వం వహించి, డైరెక్టర్‌గా మారారు. ఆపై జీవా హీరోగా కో (తెలుగులో రంగం)తో ఆయన సత్తా ప్రేక్షకులకు తెలిసింది.
 
తర్వాత మాట్రాన్ (తెలుగులో బ్రదర్స్), ఆనేగన్ (తెలుగులో అనేకుడు, కాప్పాన్ (బందోబస్త్) సినిమాలకు దర్శకత్వం వహించారు. మద్రాస్ లో పుట్టిన ఆయన, ప్రీ లాన్స్ ఫోటో జర్నలిస్ట్ గా కెరీర్‌ ను స్టార్ట్ చేసిన ఆయన, ఇండియా టుడే సహా పలు పత్రికల్లో పని చేశారు. 
 
ఆపై పీసీ శ్రీరామ్ శిష్యుడిగా మారి పలు సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించి, ఆపై దర్శకుడిగా మారారు. ఆయన మరణం కోలీవుడ్ కు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments