ప్రభుత్వం ప్రకటించినా ప్రకటించకపోయినా వచ్చే రెండువారాలపాటు వ్యక్తిగత లాక్డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని `మహానటి` దర్శకుడు నాగ్ అశ్విన్ తెలియజేస్తున్నారు. సోషల్‌మీడియాలో లాక్‌డౌన్ గురించి మీడియాలోనూ పలు రకాలుగా వస్తున్న వార్తల పట్ల ఆయన స్పందించారు. కరోనాకు లాక్‌డౌన్ సమాధానం కాదని అనుకునేవారు ఒక్కసారి ఆసుపత్రులకు వెళ్ళి చూడండి. వాళ్ళు రోయింబళ్ళు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది. వారు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. మరి వారికి కాస్త రిలీఫ్ ఇవ్వవలసిన అవసరం మనకు ఎంతైనా వుంది.
మనం మాస్క్‌లు ధరిద్దాం. వైద్యులకు పనితగ్గిదామంటూ ట్వీట్ చేశాడు. ఇటీవలే నాగ్ అశ్విన్ జాతిరత్నాలు సినిమా విజయాన్ని చవిచూశారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కనుక ఆయన తీయబోయే సినిమా ప్రభాస్‌తో వుంది. అది కరోనా సెకండ్‌వేవ్ వల్ల ఆగిపోయింది. ఈ గేప్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు మరింత శ్రద్ధగా చేసుకుంటున్నారు.