Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి ఎదురుచూపులు ఎవరి కోసం..?

Webdunia
శనివారం, 9 మే 2020 (12:45 IST)
ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఆ తర్వాత కణం, పడి పడి లేచే మనసు, ఎన్.జి.కె చిత్రాలతో ఆకట్టుకుంది. పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు ఆమె మరింత వన్నె తెస్తుంది. పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకుని.. ఆ పాత్రలో ఆమె తప్ప.. ఇంకెవరూ అలా నటించలేరు అనేలా నటించడం సాయి పల్లవి ప్రత్యేకత. 
 
ఫిదా సినిమా కోసం తెలంగాణ స్లాంగ్ నేర్చుకుని మరీ.. నటించి శభాష్ అనిపించుకుంది. ఈ ఫిదా బ్యూటీ ప్రస్తుతం విరాట పర్వం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసారు.
 
ఈ పోస్టర్లో సాయిపల్లవి అమరవీరుల స్థూపం దగ్గర కూర్చోని ఎవరి కోసమే ఎదురు చూస్తుంది. అయితే... అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్థూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది ? ఎవరి కోసం ఆమె నిరీక్షణ ? ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్నఅక్షరాలేమిటి? ఆమె పక్కనున్న బ్యాగ్‌లో ఉన్నవేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే అంటున్నారు దర్శకుడు వేణు ఉడుగుల.
 
ఈ పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసిందని చెప్పచ్చు. ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతోంది ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తానికి విరాట పర్వం పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments