Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరి చిత్రంలో ప్రైడ్ లుక్‌తో సాయి కుమార్

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (17:01 IST)
saikumar look
మనిషి ఎలా బతకకూడదు అనే పాయింట్‌తో `అరి` సినిమా  రూపొందుతోంది. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "అరి". మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాకు పెట్టుకున్న బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్ అనే క్యాప్షన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ చిత్రాన్నిఆర్వీ రెడ్డి సమర్పణలో అర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.  
 
పేపర్ బాయ్ సినిమా ద్వారా ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జయశంకర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సాయి కుమార్ నటిస్తున్న  ప్రైడ్ క్యారెక్టర్ లుక్‌ను తాజాగా హీరో ఆది సాయికుమార్ విడుదల చేశారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇదని పోస్టర్ లుక్ ద్వారా తెలుస్తోంది. మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం అరి సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.
 
సాంకేతిక నిపుణులు 
రచన – దర్శకత్వం :జయశంకర్, సమర్పణ : ఆర్వీ రెడ్డి, నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి , శేషు మారం రెడ్డి , సంగీతం : అనుప్ రూబెన్స్ , ఎడిటర్ : జి. అవినాష్ , సాహిత్యం : కాసర్ల శ్యాం , వనమాలి, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ , స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సినిమాటోగ్రఫీ : శివశంకర వరప్రసాద్, పీఆర్వో - జీఎస్కే మీడియా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments