Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాసనసభలో సూర్యగా ఇంద్రసేన

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (16:53 IST)
Indrasena
హీరోగా పలు చిత్రాల్లో నటించి. మెగాస్టార్ చిరంజీవి సైరా, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ధృవ చిత్రాలతో గుర్తింపు పొందిన ఇంద్రసేన, శాసనసభ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య అనే పవర్‌ఫుల్ పాత్రలో కథానాయకుడిగా కనిపించబోతున్నాడు ఇంద్రసేన. ఈ చిత్రంలో ఇంద్రసేనకు సంబంధించిన పవర్‌ఫుల్ లుక్‌ను దసరా పర్వదినాన విడుదల చేసింది చిత్రబృందం. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవిబసుర్.కేజీఎఫ్-2 తరువాత రవిబసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్‌ఇండియా చిత్రం శాసససభ. 
 
 ఐశ్వర్యరాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణానంతర పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. 
 
ఈ చిత్రం విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని తెలియజేస్తూ,  పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవిబసుర్ అందిస్తున్న సంగీతం, నేపథ్యసంగీతం మెయిన్‌పిల్లర్‌గా వుంటుంది. ఈ చిత్రంలో కథానాయకుడు ఇంద్రసేన పాత్ర ఎంతో విభిన్నంగా, డైనమిక్‌గా వుంటుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం వుంది అన్నారు. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ ప్రతిష్టను పెంచేవిధంగా వుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

డెలివరీ ఏజెంట్‌గా వచ్చి అత్యాచారం చేశాడంటూ పూణే టెక్కీ ఫిర్యాదు

Son: రూ.20 ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపేసిన కొడుకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments