తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభల సమావేశం మొదలవుతుంది. ఆ తర్వాత ఇటీవల మరణించిన మాజీ శానస సభ్యులకు సభ సంతాపం తెలుపుతుంది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం అనంతరం సభ వాయిదాపడుతుంది.
ఆ తర్వాత మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిల అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ కమిటి (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఇందులో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
అలాగే, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా ఉభయసభల్లో విపులంగా చర్చించే అవకాశం ఉంది.