Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెప్టెంబరు 6న రెడ్మి డ్యూయల్ సిమ్ 5జీ స్మార్ట్ ఫోన్

redmi 5g smartphone
, మంగళవారం, 30 ఆగస్టు 2022 (21:48 IST)
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ రెడ్మి సరికొత్త ఫీచర్లతో 5జీ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోనును తయారు చేసింది. ఈ ఫోనును సెప్టెంబరు 6వ తేదీన భారతీయ స్మార్ట్ మార్కెట్‌లోకి విడుదలకానుంది. ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 
 
ముఖ్యంగా, మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ చేయగా, 50 మెగా పిక్సెల్‌తో ప్రధాన కెమెరాను అమర్చారు. ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశముంది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫోనుకు సంబంధించిన కొన్ని ఫీచర్లను షియోమీ వెల్లడించింది. అయితే, ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు, ఆ సంస్థ వర్గాల సమచారం మేరకు కొన్ని ఫీచర్లు లీకయ్యాయి. వీటిని ఓ సారి పరిశీలిస్తే,
 
ఈ 5జీ స్మార్ట్ ఫోనులో రెండు సిమ్‌లు ఉంటాయి. ఈ రెండు కూడా 5జీకి సపోర్టు చేసే సదుపాయం ఉంది. మొబైల్ వినియోగదారుడు అవసరాన్ని బట్టి  ఏ సిమ్‌ను అయినా 5జీ నుంచి 4జీ, జీఎస్ఎం వంటి వాటికి మార్చుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ఫోనులో ప్రధానంగా 700 ఆక్టాకోర్ చిప్ సెట్‌ను అమర్చారు. 4జీబీ ర్యామ్ నుంచి 8 జీబీ ర్యామ్ వరకు మోడళ్లను అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ఈ ఫోనులో 6.5 అంగుళాల టియర్ డ్రాప్ ఫుల్ హెచ్.డి రిజల్యూషన్‌తో డిస్ ప్లే ఉండనుంది. 5 వేల ఎంఏహెచ్ సామర్థ్యమున్న లిథియం పాలిమర్ జంబో బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. 
 
50 మెగా పిక్సెల్ మెయిన్ కెమరాతో డ్యూయల్ కెమెరా సెటప్, డ్యూయల్ ఎల్.ఈ.డి. ఫ్లాష్‌ను అమర్చారు. ఈ ఫోన్ ప్రాథమికంగా రెండు రంగుల్లో అందుబాటులోకి తీసుకునిరానున్నారు.
 
ఈ సంస్థ గతంలో తీసుకొచ్చిన సబ్ బ్రాండ్ అయిన పోకో ఎం5 5జీ మోడల్‌ను రీబ్రాండ్ చేసి రెడ్మీ 11 ప్రైమ్ 5జీ కింద విడుదల చేయనుందనే ప్రచారం టెక్ నిపుణుల్లో ఓ చర్చ సాగుతోంది. 
 
సెప్టెంబర్ 6న షియోమీ సంస్థ అధికారికంగా రెడ్ మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్‌ను ఆవిష్కరించి, పూర్తి ఫీచర్లను ప్రకటించనుంది. ఆ తర్వాత వివిధ ఆన్‌లైన్, ఈ కామర్స్ వెబ్ సైట్లలో విక్రయాలు ప్రారంభంకానున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై రూ.14 వేల డిస్కౌంట్