Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' మూవీ 'బాహుబలి' రికార్డును తిరగరాస్తుందా?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (13:33 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం "సాహో". ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంటే సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. 
 
'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో' కావడంతో ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, అటు ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సాహో రెండో మేకింగ్ వీడియోను ఆదివారం హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేశారు. 
 
ఈ మేకింగ్ వీడియో ఇపుడు యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ప్రోమో చూస్తే మూవీలో యాక్షన్ సీన్స్ అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఊహించినట్లే ఈ వీడియోకు ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 12 గంటల్లోనే 70 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం. 
 
అన్ని భాషల్లో రిలీజ్ చేసిన వీడియోలు అన్నింటికీ కలిపి ఈ వ్యూస్ వచ్చినట్లు సాహో టీమ్ ఓ ట్వీట్‌లో వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని గత రెండేళ్లుగా నిర్మిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments