Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో... ఇప్పటివరకు పూర్తయింది అంతేనా?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:16 IST)
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం సాహో. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌లో నిర్మితమయ్యే ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం సహా అనేక ఇతర భాషల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
 
ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద కొన్ని కీలక యాక్షన్ సన్నివేసాలను చిత్రీకరించినట్లు సమాచారం. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ కేవలం 50% మాత్రమే పూర్తయిందట. మిగిలిన షూటింగ్‌ను మే కల్లా పూర్తి చేసి జూలైకి మిగిలిన పనులను పూర్తి చేసేసి ఆగస్ట్ నెలలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.
 
అయితే ఇప్పుటికీ పూర్తయిన యాక్షన్ సన్నివేశాలను విజువల్ ఎఫెక్ట్స్ కోసం పంపినట్లు సమాచారం. త్వరలోనే పాటల చిత్రీకరణ, మరికొన్ని కీలకమైన సీన్లు చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ సినిమా కోసం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యాక్షన్ కొరియో గ్రాఫర్ కెన్నీ బేట్స్ పని చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments