Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ ఇంట్లో వెడ్డింగ్ బెల్స్... మార్చి 1న అశ్రిత వివాహం?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (11:05 IST)
విక్టరీ వెంకటేష్ కుమార్తె అశ్రిత ఓ ఇంటికి కోడలు కానుంది. ఈమె వివాహం వచ్చే నెల ఒకటో తేదీన జరుగనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ పెళ్లి వేడుకలను అత్యంత ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా, బుధవారం రాత్రి అశ్రితకు నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత... ఫుడ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించింది. ఈమె హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో గత కొంతకాలంగా ప్రేమాయ‌ణంలో ఉంది. ఈ విషయాన్ని త‌న కుటుంబ స‌భ్యుల‌కి చెప్ప‌డంతో వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. 
 
అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం అశ్రిత నిశ్చితార్థ కార్యక్రమం బుధవారం సాయంత్రం అత్యంత రహస్యంగా, కేవలం ఇరు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల మధ్యే జరిగినట్టు సమాచారం. ఇక వివాహానికి ముహూర్తం మార్చి ఒకటో తేదీన ఫిక్స్ చేశార‌ని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ స్పందించడం లేదు. 
 
హీరో వెంకీ కూతురు అశ్రిత బేక‌రీ బిజినెస్ చేస్తుండ‌గా, ఇప్పటికే సిటీలో కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసిందట. ఇక‌ వెంక‌టేష్ త‌న మేన‌ల్లుడు నాగ చైత‌న్య‌తో క‌లిసి 'వెంకీ మామ' అనే చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం ఫిబ్ర‌వరి 22వ తేదీన సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వహించనున్నాడు. దగ్గుబాటి రానా కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments