Publish Date: Mon, 21 Jan 2019 (14:25 IST)
Updated Date: Mon, 21 Jan 2019 (14:26 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? గత కొన్ని సంవత్సరాలుగా సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ సమాధానం చెప్పినా.. త్వరలోనే అని ఉంటుంది. బాహబలి పూర్తైన తర్వాత ఉంటుంది అని చెప్పారు. బాహుబలి రిలీజైంది. సంచలన విజయం సాధించింది అయినా ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు. దీంతో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పట్లో దొరకదేమో అనుకున్నారు. ఇదిలా ఉంటే... రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా తన మనసులో మాటలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు సమాధానంగా... అందరూ ప్రభాస్ పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నారు. సాహో సినిమా తర్వాత కచ్చితంగా ఉంటుంది అని చెప్పారు. సాహో ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మరి.. ఈసారైనా సాహో రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా..? లేక ఎప్పటిలాగానే ఇంకా టైముంది అంటాడో చూడాలి. కొందరైతే.. ప్రభాస్ పెళ్లి దాటవేయడానికి ఏమైనా ప్రాబ్లం వుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ
Publish Date: Mon, 21 Jan 2019 (14:25 IST)
Updated Date: Mon, 21 Jan 2019 (14:26 IST)