Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రవీణ పాటలు అన్నీ ఆణిముత్యాల్లాగా వున్నాయి, చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (13:37 IST)
Rudraveena team
శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ  హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “రుద్రవీణ’. ఈ చిత్రం నుండి విడుదలైన  ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు  పూర్తి చేసుకొని ఈ నెల 28 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరుపుకుంది.
 
చిత్ర నిర్మాత రాగుల లక్ష్మణ్, మాట్లాడుతూ, ఇందులో ఎల్సా, శుభశ్రీ లు యాక్టింగ్ చాలా బాగా చేశారు. అలాగే మరో నటి సోనియా లేడీ విలన్ గా మంచి పెర్ఫార్మన్స్ చేసింది.ఇలా ఇందులో ఉన్న ముగ్గురు అమ్మాయిలు చాలా కష్టపడి పని చేశారు.రఘు కుంచె  విలన్ గా అద్భుతమైన నటనను కనపరచ్చాడు. హీరో కు ఈ సినిమా తర్వాత మంచి పేరు వస్తుంది. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కథ చాలా కొత్తగా మనం ఎప్పుడూ చూడని కథను చూస్తారు. ఇందులోని పాటలు అన్నీ ఆణిముత్యాల్లాగా అద్భుతంగా వచ్చాయి .మనకు జరిగే ప్రతి ఫెస్టివల్ లో ఈ సాంగ్స్ ప్లే అయ్యేలా ఉంటాయి. మంచి కాన్సెప్ట్ తో ఈ నెల 28 న థి యే టర్స్ లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా రుద్ర వీణ చిత్రం అందరికీ  కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
మరో నిర్మాత రాగుల శ్రీను మాట్లాడుతూ...మా అమ్మ గారి నిర్మాణంలో మేము ఈ సినిమా తీశాము.చిన్నప్పటి నుండి మేము చిరంజీవి కి బిగ్ ఫ్యాన్స్ .అయితే ఇప్పుడు మేము తీసిన సినిమాకు చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమా "రుద్ర వీణ" టైటిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రఘు కుంచె విలన్ గా చాలా బాగా నటించారు.   ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో  సినిమా బాగా వచ్చింది. ఈ నెల 28 న వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
 
నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే మాట్లాడుతూ.. రుద్రవీణ సినిమా కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. విలన్ క్యారెక్టర్ చేస్తున్న నా ముఖానికి  గాటు ఉండేలా డిఫరెంట్ లుక్ డిజైన్ చేశారు. హీరోయిన్స్ కూడా వారి, వారి నటనను  ప్రూవ్ చేసుకునేలా చాలా బాగా చేశారు. హీరో హెవీ ఎమోషన్ ఉండే చాలా పెద్ద క్యారెక్టర్ చేశాడు. తనకు మంచి పేరువస్తుంది.ఈ సినిమాకు నిర్మాతల సహకారం  మరువలేనిది అందరినీ చాలా బాగా చూసుకున్నారు.కమర్సియల్ గా ఇందులో లవ్, రొమాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాలుగా ఉంటుంది. ఫుల్ ప్యాకేజ్డ్ గా వస్తున్న "రుద్రవీణ" చిత్రం కచ్చితంగా చిన్న సైజు అఖండ లా అద్భుతంగా తీశారు. ఈ నెల 28 న వస్తున్న ఈ సినిమా గొప్పవిజయం సాదించాలి అన్నారు.
 
చిత్ర దర్శకుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, నిర్మాత‌ల‌కు ఈ కథ నచ్చడంతో అనుకున్న బడ్జెట్ ఎక్కువైనా సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు .మంచి కథతో వస్తున్న మా సినిమాను ఆదరిస్తే నిర్మాతలు మళ్ళీ మరో మంచి సినిమాతో మీ ముందుకు వచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు.ఇందులో రఘు కుంచె గారు అద్భుతంగా నటించారు. వీరితో పాటు హీరో, హీరోయిన్ లు అందరూ చాలా బాగా నటించారు. ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంటుంది. ఈ నెల 28 న వస్తున్న మా చిత్రాన్ని అందరూ అందరూ ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరో శ్రీ రామ్ నిమ్మల మాట్లాడుతూ.. ఈ టైటిల్ పెట్టుకోవడానికి చాన్స్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదములు. మా సినిమాకు ఇంత హైప్ రావడానికి కారణం మెగాస్టార్ గారే. నిర్మాత లక్ష్మణ్ గారు చిరంజీవి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్, దాంతో తను ఈ సినిమాకు ఆ టైటిల్  వచ్చేలా చాలా కష్టపడ్డారు.తనకిది మెదటి సినిమా అయినా అన్ని క్రాఫ్ట్ లలో చాలాబాగా మానేజ్ చేశాడు. సినిమాకు ఏమి కావాలన్నా కూడా ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని చాలా బాగా నిర్మించాడు. దర్శకుడు నన్ను మాస్ హీరో లా ఊహించుకొని నా పాత్ర ను చాలా చక్కగా మలచారు.రఘు కుంచె  గారితో  వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కెమెరామెన్ నన్ను చాలా బాగా చూయించాడు. నాకిలాంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
 
చిత్ర హీరోయిన్ ఎల్సా మాట్లాడుతూ..లవ్, రొమాంటిక్, కామెడీ, రివేంజ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు అందరూ చాలహార్డ్ వర్క్ చేసి సినిమాను పూర్తి చేశాము. దర్శక, నిర్మాత నాకు ఫుల్ సపోర్ట్ చేశారు ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఈ సినిమా  గొప్ప విజయం సాదించాలి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments