Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాడ్ ఫాదర్‌లోని థార్ మార్ సాంగ్‌కు ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీ

Advertiesment
Chiranjeevi, Salman Khan
, బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:43 IST)
Chiranjeevi, Salman Khan
ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి-సల్మాన్ ఖాన్‌ల మెగా మాస్ ప్రభంజనంతో రూపొందుతోన్న గాడ్ ఫాదర్ నుంచి థార్ మార్ సాంగ్ ప్రోమో (కొస‌రు పాట)  విడుదలైంది. పూర్తి పాట‌ను చూడాలంటే సెప్టెంబర్ 15న గురువారం వ‌ర‌కు ఆగాల్సిందే.  ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి  ఇద్దరు మెగాస్టార్లు తొలిసారి చేతులు కలిపారు. అంతకంటే ముందు వీరిద్దరూ కలిసి తమ మాస్ డ్యాన్స్‌లతో మెగా మాస్ ప్రభంజనం సృష్టించారు. ఈ చిత్రం మొదటి సింగిల్- థార్ మార్ థక్కర్ మార్ ప్రోమో విడుదలైయింది.
 
చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లను కలిసి తెరపై చూడడం కన్నుల పండుగలా వుంది. వీరిద్దరి మాస్ కెమిస్ట్రీ మెస్మరైజ్ చేసింది. ఒకే రకమైన దుస్తులు ధరించి ఇద్దరూ వెండితెర ఆరాధ్య దైవాలుగా అలరించారు. ఇద్దరూ బ్లాక్ షేడ్స్ వాడటం స్టైల్ ని మరింత పెంచింది.
 
థమన్ అద్భుతమైన మాస్ డ్యాన్స్ నంబర్‌ ని కంపోజ్ చేయగా, చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ మూమెంట్స్ మెగా మాస్ జాతర సృష్టించాయి. హుక్ స్టెప్ ఖచ్చితంగా మాస్‌ను అలరిస్తోంది. భారీ సెట్‌లో ప్రభుదేవా మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. శ్రేయా ఘోషల్ ఈ పాటని ఆలపించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. 
 
మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, సత్య దేవ్, సునీల్,  సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్.
 
గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.
 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్పణ: కొణిదెల సురేఖ
బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం: ఎస్ ఎస్ థమన్
డీవోపీ: నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు
పీఆర్వో: వంశీ-శేఖర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ హౌస్‌లో రెండో వారం రచ్చరచ్చ