Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ హౌస్‌లో రెండో వారం రచ్చరచ్చ

Advertiesment
big boss
, బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:19 IST)
బిగ్ బాస్ హౌస్‌లో రెండో వారం రచ్చరచ్చగా సాగుతోంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల్ని ఎంపిక చేయడం కోసం ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందరికీ ఒక్కో బొమ్మని ఇచ్చాడు. ఎవరి బేబీని వాళ్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిక్షణం కాపాడుకోవాలి. పొరపాటున దాన్ని పక్కన పెట్టినప్పుడు ఎవరైనా తీసుకెళ్లి బిగ్‌బాస్ కేటాయించిన స్పెషల్ ప్లేస్‌లో పెట్టారా.. ఇక వాళ్లు పోటీకి అనర్హులు. 
 
అలాగే మధ్య మధ్యలో టాస్కులు పెడుతుంటారు. బజర్ మోగగానే ఏ ఐదుగురు ముందుగా వెళ్లి తమ బేబీస్‌ని స్ట్రోలర్స్‌లో వేస్తారో వాళ్లు ఆ టాస్క్ లో పోటీపడతారు. గెలిచినవారు కెప్టెన్సీ పోటీకి అర్హులవుతారు. మొదటి టాస్క్.. బోర్డ్‌లో ఉన్న ఖాళీల్లో వాటికి తగిన సింబల్స్‌ని తీసుకొచ్చి ఫిక్స్ చేయాలి. 
 
అయితే మామూలుగా కాదు. కాళ్లకి గోనెసంచుల్ని కట్టుకుని, ఎగురుకుంటూ వెళ్లి ఆ పని చేయాలి. అందరి కంటే ఫాస్ట్‌గా రేవంత్ ఆడాడు. అయితే అతనికి కావలసిన చివరి సింబల్‌ను ఫైమా తన బోర్డులో పెట్టేసుకుంది. అది తనది కాదని తెలిసి కూడా ఆమె తీయకుండా అలా ఉంచేసింది. రేవంత్ ఎంత బతిమాలినా కూడా తీసి ఇవ్వలేదు. దాంతో రేవంత్ ఓడిపోయాడు. చంటి గెలిచాడు.
 
మొదటి కెప్టెన్సీ పోటీదారుడు అయ్యాడు. రెండో టాస్క్ కోసం బజర్ నొక్కినప్పుడు కాలు బెణికిన ఫైమా తరఫున రేవంత్ ఆడాడు. ఆమె బేబీని రైట్ టైమ్‌లో ప్లేస్ చేశాడు.
 
ఎవరైనా తమ బేబీని ఒంటరిగా వదిలేసినపుడు.. ఇంకొకరు దాన్ని తీసుకెళ్లి బిగ్‌బాస్ కేటాయించిన స్పెషల్ ప్లేస్‌లో పెడితే ఇక వాళ్లు పోటీకి అనర్హులనే పాయింట్ గీతూకి తెగ నచ్చేసింది.
 
ఎవరైనా కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు.. వాళ్ల బొమ్మను తీసుకెళ్లి అక్కడ పడేయడం మొదలుపెట్టింది. ఈ విషయంలో ఆమె తెలివిని మెచ్చుకోవాల్సిందే. 
 
అసలే తిండి ప్రియురాలు కావడంతో ఫుడ్ చూడగానే శ్రీసత్య తన బేబీని పక్కన పెట్టింది. అంతే గీతూ దాన్ని ఎత్తేసింది. అభినయశ్రీ కూడా తన బొమ్మను పక్కన పెట్టి ఏదో ఆలోచిస్తూ ఉండటంతో దాన్నీ తీసుకుపోయింది. అది బేబీని వదిలేయడం కాదని అభినయశ్రీ వాదించడంతో కెప్టెన్ బాలాదిత్య తన బొమ్మని తనకి ఇచ్చేశాడు. 
 
అలా కుదరదని, బొమ్మను స్టోర్ రూమ్‌లో పెట్టేయమని బిగ్‌బాస్ చెప్పడంతో గీతూ ఎగిరి గంతులేసింది. మాటిమాటికీ గీతూ దగ్గరున్న బేబీని ఏడిపించి డైపర్లు మార్పించాడు. తానెప్పుడూ పిల్లల్ని చూసుకోలేదని గీతూ మొత్తుకునేకొద్దీ కావాలని ఆమెని విసిగించడంతో మిగతా హౌస్‌మేట్స్‌ అంతా తెగ ఎంజాయ్ చేశారు.
 
రేవంత్ మూడ్ స్వింగ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. అప్పుడే అరుస్తున్నాడు. అప్పుడే కూల్ అవుతున్నాడు. బాలాదిత్య ఆల్రెడీ తనకి క్లాస్ తీసుకున్నాడు. నీ ఫ్రస్ట్రేషన్ అంతా మాటల్లోనే తెలిసిపోతుంది, ఎందుకలా, కూల్‌గా ఉండొచ్చు కదా అని చెప్పాడు. అయినా కూడా ఇవాళ చాలాసార్లు సహనం కోల్పోయాడు రేవంత్. 
 
ఫైమా స్ట్రాటజీతో ఆడటంతో మండి పడ్డాడు. అయితే బాలాదిత్య ఓ సమయంలో కన్‌ఫ్యూజ్ అయ్యి.. ఫైమా తరఫున రేవంత్ ఆడటం చెల్లదు అన్నాడు. ముందు ఓకే అని ఇప్పుడెలా కాదంటావ్ అని క్వశ్చన్ చేసే క్రమంలో.. సంచాలకురాలైన నేహ ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదు అని అడిగాడు రేవంత్. 
 
దానికి నేహ హర్ట్ అయిపోయింది. అంత చిన్న మాటకే తనపై నింద వేశాడంటూ నానా యాగీ చేసింది. ఇక గీతూ తన బేబీని తీసుకెళ్లిపోయినప్పుడు గర్భవతి అయిన తన భార్యను, పుట్టబోయే బిడ్డను తలచుకుని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ బొమ్మని స్టోర్‌ రూమ్‌లో పెట్టేయమని బిగ్‌బాస్ చెప్పినప్పుడు కూడా భారమైన మనసుతోనే ఆ పని చేశాడు. 
 
మొత్తంగా తనొక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో కనిపిస్తున్నాడు. అందరూ తనని టార్గెట్ చేయడం అతనిని బాధిస్తోంది. అందుకే సీరియస్ అయిపోతున్నాడు. క్షణాల్లో తప్పు తెలుసుని కూల్ అయిపోతున్నాడు. గీతూ తన బొమ్మని తీసుకుపోకుండా కీర్తి చాలా అడ్డు పడిందని తెలిశాక ఆమెని పిలిచి హగ్ ఇచ్చాడు రేవంత్. 
 
శ్రీసత్యని కూడా అందరితో కలిసి ఉండమని చెప్పాడు. కామెడీ చెయ్యి గానీ నిన్ను కామెడీగా తీసుకునే చాన్స్ ఎవరికీ ఇవ్వొద్దు అని ఫైమాని మోటివేట్ చేశాడు. అతని మనసు మంచిదే కానీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం రావడం లేదని వీటన్నింటిని బట్టి అర్థమవుతోంది.
 
తన భర్త తనను పట్టించుకోవట్లేదంటూ తెగ ఫీలైపోయే మెరీనా.. ఇవాళ అతనితో కలిసి మంచి ఫుటేజే ఇచ్చింది. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఇద్దరూ రొమాంటిక్‌గా కనిపించారు. 
 
మొత్తానికి ఇలా ఎవరికి నచ్చిన తీరులో వారు ఉంటున్నారు. ఎవరి దోస్తులతో వాళ్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. కానీ ఆట సమయంలో ఒకరినొకరు వేటాడుతున్నారు. టైమ్ అయిపోవడంతో ఇవాళ్టికి టాస్క్ ఆపేసిన బిగ్‌బాస్.. తర్వాతి ఎపిసోడ్‌లో కంటిన్యూ చేయబోతున్నాడు. 
 
అయితే అది మరిన్ని ఇష్యూస్ క్రియేట్ చేయబోతుందని ప్రోమో ద్వారా అర్థమయ్యింది. ఎందుకంటే నిద్రపోతున్న వారి చేతుల్లోంచి లాక్కుని మరీ గీతూ బొమ్మల్ని ఎత్తుకుపోతోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొద్దుగా ఉంటే సినీ అవకాశాలు రావని గ్రహించలేక పోయా: అపర్ణా బాలమురళి