Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ నుంచి కొమరం భీమ్ వీడియో.. గర్జించిన ఎన్టీఆర్ (video)

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (11:50 IST)
KomaramBheem
ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. బాహుబలి సినిమాతో చరిత్రలు సృష్టించిన రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం అనే చిత్రం చరిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోత ఆధారంగా రూపొందుతుంది. 
 
తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
 
 


 
వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్ర షూటింగ్ మార్చి నుండి కరోనా వలన ఆగిపోయింది. రీసెంట్‌గా తిరిగి షూటింగ్ ప్రారంభించారు. అయితే చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్‌కు సంబంధించిన వీడియోని ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన రాజమౌళి.. ఎన్టీఆర్ బర్త్‌డేకు విడుదల చేయలేకపోయాడు. కాకపోతే లేట్ అయినప్పటికీ అభిమానుల అంచనాలను మించేలా సర్‌ప్రైజ్ ఉంటుందని హామీ ఇవ్వడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
 
తాజాగా రామరాజు వాయిస్‌తో భీంకు సంబంధించిన వీడియోని విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ లుక్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. దాదాపు రెండేళ్ళ తర్వాత తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించి వచ్చిన ఈ వీడియో రికార్డుల మోత మోగించడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments