Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి "ఆర్ఆర్ఆర్" తాజా అప్‌డేట్స్ ఏంటంటే...

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (18:39 IST)
'బాహుబలి'తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌, హైటెక్నికల్ వేల్యూ‌తో రూపొందుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీగా ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 
 
తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌తో పాటు, భీమ్‌ ఫర్‌ రామరాజు, రామరాజు ఫర్‌ భీమ్‌ టీజర్‌లకు వరల్డ్‌ వైడ్‌గా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. 
 
ముఖ్యంగా, రాంచరణ్‌ పాత్రను నిప్పుతో, ఎన్టీఆర్‌ పాత్రను నీటితో పోల్చుతూ.. రాజమౌళి సృష్టిస్తోన్న అద్భుతాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా..! అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా చిత్రయూనిట్‌ ఓ అప్‌డేట్‌ను విడుదల చేసింది.
 
ఈ చిత్రం క్లైమాక్స్‌ షూటింగ్‌ స్టార్ట్ అయినట్లుగా తెలుపుతూ.. భీమ్‌, రామరాజులు చేతులు కలిపిన పిక్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. భీమ్‌, రామరాజు కలిసి వారు సాధించాలనుకున్నది సాధించేందుకు సిద్ధమవుతున్నారని తెలుపుతూ.. చిత్రయూనిట్‌ విడుదల చేసిన పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోంది. 
 
ఇక ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేసేలా జక్కన్న ప్లాన్‌ చేస్తున్నట్టు వినికిడి. మిగిలి ఉన్న 20 శాతం షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ అంతా పూర్తి చేసి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని విజయదశమికి థియేటర్లలోకి తీసుకురావాలనేలా రాజమౌళి అండ్‌ టీమ్‌ కృషి చేస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments