Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ను కలువనున్న రాజమౌళి.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (23:05 IST)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్-దర్శక ధీరుడు రాజమౌళిలు త్వరలో భేటీ కానున్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా 2022, జనవరి 7న రిలీజ్ కాబోతోంది ఆర్ఆర్ఆర్. ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటిస్తున్నారు. 
 
అల్లురి సీతారామరాజు, కొమురమ్ భీమ్ పాత్రలో ఈ స్టార్ హీరోలు నటించిన ఆర్ఆర్ఆర్ మీద ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి. కరోనా వేవ్స్ తర్వాత ఇంత పెద్ద పాన్ ఇండియన్ సినిమా వస్తుందంటే రిలీజ్‌కు ముందు ఆ తర్వాత కనీసం 15 రోజుల వరకు ఏ సినిమా పోటీ ఉండకూడదు.
 
అంటే కనీసం నెలరోజులు ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాకు దరిదాపుల్లో మరో పోటీ ఉండకుండా ఉంటే అప్పుడు వసూళ్ళు రికార్డ్ స్థాయిలో ఉంటాయి. దీనికి రాధే శ్యామ్ లాంటి మరో పాన్ ఇండియన్ సినిమా, భీమ్లా నాయక్ లాంటి భారీ మల్టీస్టారర్, సర్కారు వారి పాట లాంటి పక్కా కమర్షియల్ సినిమాలు పోటీ ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాల ప్రభావం ఆర్ఆర్ఆర్ మీద ఉంటుంది. 
 
అందులో పవర్ స్టార్ సినిమా అంటే మల్టీస్టారర్ అయినా ముందు ప్రిఫరెన్స్ పవన్ సినిమాకే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు రాజమౌళి పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి రేస్ నుంచి తప్పించమని రాజమౌళి పవన్‌ను రిక్వెస్ట్ చేయడానికి వెళుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. 
 
ఇప్పటికే మహేశ్ బాబు తన సర్కారు వారి పాట సినిమాను రాజమౌళి రిక్వెస్ట్ మేరకు సంక్రాంతి బరి నుంచి తప్పించి ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. మరి పవన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments