Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింటేజ్ కార్లకు భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్న 'ఆర్ఆర్ఆర్'

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (19:01 IST)
ఆర్ఆర్ఆర్ సినిమా రెండో షెడ్యూల్ పనులు పూర్తి కావొచ్చాయి. దీని తర్వాత యూనిట్ ఉత్తర భారతదేశంలో జరిగే షూటింగ్‌లో పాల్గొంటుంది. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.  కాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ బయటకు వచ్చింది. 
 
ఆర్ఆర్ఆర్ 1920 కాలానికి చెందిన స్టోరీతో సినిమా కాబట్టి ఈ సినిమాలో ఆ కాలానికి చెందిన కార్లు ఉండాలి. ఆ కాలానికి చెందిన కార్లను సేకరించడం అంటే చాలా కష్టం. చాలా కొద్దిమంది దగ్గర మాత్రమే ఉంటాయి. వీటిని అద్దెకు తీసుకోవాలన్నా కూడా ఖర్చు తడిసి మోపెడు అవుతుంది.

బెంగుళూరులో డాక్టర్ రవి ప్రకాష్ అనే వ్యక్తి ఇలాంటి వింటేజ్ కార్లకు సుప్రసిద్ధి. ప్రపంచంలో ఎవరి దగ్గరా దొరకని సుమారు 150కి పైగా కార్లు ఈయన రేర్ కలెక్షన్స్‌లో ఉన్నాయి. జవహర్ లాల్ నెహ్రూ వాడిన 1928 నాటి లాంచెస్టర్ ఎస్‌టి8 మోడల్‌తో పాటు జాగ్వార్ క్లాసిక్ రేంజ్ లాంటి కార్లు ఎన్నో ఆయన వద్ద ఉన్నాయట.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలుకావడానికి ముందే అక్కడికి వెళ్ళి 1920లో వాడిన కార్లను చూసుకుని ఏడాది అద్దెకు బుక్ చేసుకున్నారట. ఇందుకోసం భారీ మొత్తాన్ని రవిప్రకాష్‌కు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments