'ఆర్ఆర్ఆర్' కోసం ఆ స్టార్ హీరోను జక్కన్న ఎలా ఒప్పించారో తెలుసా...

మంగళవారం, 19 మార్చి 2019 (11:22 IST)
ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్" సినిమాపై ప్రారంభం నుండి చాలా హైప్ క్రియేట్ అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమౌళి ప్రెస్‌మీట్ పెట్టి మరీ అప్‌డేట్‌లు ఇవ్వడంతో ప్రేక్షకులే కాదు, సినీ వర్గాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ అజయ్ దేవగణ్‌ను ఈ సినిమాలో నటింపజేయడానికి బాగా కష్టాపడ్డారంట రాజమౌళి.
 
ప్రెస్‌మీట్ జరగడానికి కొన్ని రోజుల ముందు అజన్ దేవగణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అజయ్ దేవగన్ నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకుని ప్రెస్‌మీట్‌లో రాజమౌళి కన్ఫామ్ చేయడం సినీ వర్గాలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. 
 
విశ్వసనీయ వర్గాల సమాటారం ప్రకారం... ఉత్తర భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రను అజయ్ దేవగన్‌‌కు రాజమౌళి ఆఫర్ చేశారట. ఆ పాత్ర నిడివి తక్కువగా ఉండటం, ఆ పాత్ర స్వభావం చూసి అజయ్ వెనుకడుగు వేశాడట. 
 
కానీ రాజమౌళి ఏమాత్రం పట్టు విడువకుండా అజయ్ కోసం ఆ పాత్ర నిడివిని పెంచడంతో పాటుగా ఆయన కోరినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట. దీంతో అజయ్ నటించడానికి ముందుకొచ్చారట. రాజమౌళి నటీనటుల ఎంపిక విషయంలో ఏమాత్రం రాజీపడకుండా అత్యధిక ప్రమాణాలతో అన్ని భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మహేష్ బాబుతో సినిమానా? చేసేది లేదన్న రష్మిక, సాయిపల్లవి?