ఇంతకీ డైసీ ఎడ్గర్ జోన్స్ ఎవరు.? తెగ సెర్చ్ చేస్తున్న నెటిజన్లు

శుక్రవారం, 15 మార్చి 2019 (17:20 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు "ఆర్ఆర్ఆర్". టాలీవుడ్ హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా బాలీవుడ్ నటి అలియా భట్‌ ఒకరు కాగా, మరో నటి డైసీ ఎడ్గర్ జోన్స్. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ప్రకటించారు. 
 
అయితే, రాజమౌళి అలా ప్రకటించారో లేదు ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా, అలియా భట్ విషయంలో అంతగా ఎక్సయిట్ కానప్పటికీ.. డైసీ ఎడ్గర్ జోన్స్ విషయంలో అందరూ విస్మయానికి లోనయ్యారు. 
 
జక్కన్న అలా ప్రకటించారో లేదో.. ఇంతకీ ఎవరీ డైసీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మల్టీస్టారర్‌లో డైసీని హీరోయిన్‌గా తీసుకున్నారంటే.. ఖచ్చితంగా ఈమె ప్రత్యేకమైన వ్యక్తే అనే టాక్ మొదలైంది. అయితే, ఇంతకీ ఈ డైసీ ఎవరన్నదానిపై ఇప్పటికీ చాలా మందిలో సందిగ్ధత ఉంది. 
 
ఆమె గురించి నెట్‌లో సెర్చ్ చేస్తే... డైసీ ఓ బ్రిటీష్ నటి. ఈమె గతంలో సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్ వంటి టీవీ సిరీస్‌లలో నటించింది. గతేడాది 'పాండ్‌ లైఫ్' అనే సినిమాలో కాషీ అనే పాత్రలో నటించింది. దీంతోపాటు 'ది రిలెక్ట్యుంటె ఫండమెండలిస్ట్‌'లో నాటకంలోనూ, 'వింటర్‌ సాంగ్' అనే షార్ట్‌ ఫిల్మ్‌లో కనిపించింది. బ్రిటన్‌లోని మస్వెల్ హిల్స్ ప్రాంతానికి చెందింది. 
 
అయితే, డేసీని జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా ఎంపిక చేయడానికిగల కారణాలు మాత్రం వెండితెరపైనే చూడాల్సి వుంది. ఎందుకంటే.. 'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులో కొమరం భీమ్ పాత్రలో తారక్ కనిపించనున్నాడు. కొమరం భీమ్ స్వాతంత్ర్యం సమరానికి ముందు ఎలా ఉన్నారు? ఆయన బాల్యం ఎలా గడిచింది? ఇల్లు వదిలి ఎందుకు వెళ్లిపోయారు? తిరిగి ఇంటికి ఎపుడొచ్చారు? అనే వరకు ఈ చిత్రం కొనసాగనుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎంతకీ పెళ్లి కావడంలేదా? అక్కడికెళ్తే ఖాయం... 360 రోజులు 360 మందిని...