జక్కన్నకే కండిషన్ పెట్టిన అలియా భట్... ఏంటో తెలుసా?

శుక్రవారం, 15 మార్చి 2019 (15:24 IST)
బాలీవుడ్ హీరోయిన్ ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లుంది. ప్రస్తుతం వరుస విజయాలతో బాలీవుడ్‌లో మంచి ఊపు మీద ఉంది అలియా. చేతినిండా ఆఫర్లతో తీరికలేని షెడ్యూల్‌తో బిజీ బిజీగా ఉంది. అలియా నటించిన గల్లీ బాయ్ సినిమా హిట్ కావడంతో ఆఫర్లు విపరీతంగా వచ్చిపడుతున్నాయి.
 
ఈ ఏడాది ఇప్పటి వరకు ఇండియాలో ఆరు భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతుండగా అందులో మూడు సినిమాల్లో అలియానే హీరోయిన్ కావడం విశేషం. ప్రస్తుతం బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న బహ్మాస్త్ర, కళంక్ సినిమాలు రెండింటిలోనూ అలియానే హీరోయిన్. ఈమెకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌తో జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాకు హీరోయిన్‌గా అలియానే తీసుకోవడం గమనార్హం. అయితే సాధారణంగా 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే అలియా జక్కన్న సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని 15 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేసిందట.
 
ఈ విషయం జక్కన్నకు చెబితే... అనుకున్న క్యారెక్టర్లో ఆమె ఫిట్ అవుతుందని అనడంతో ఆమె అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాత ఇచ్చేందుకు వెనుకాడలేదని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం స్త్రీలను తప్పుదోవ పట్టించే విధంగా '90 ఎంఎల్' చిత్రం.. వారిద్దరిని అరెస్ట్ చేయాలి..?