Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరు మహనీయులు.. ఒకరికొకరు తెలియని వాళ్లు... అదే "ఆర్ఆర్ఆర్" కథ

ఇద్దరు మహనీయులు.. ఒకరికొకరు తెలియని వాళ్లు... అదే
, గురువారం, 14 మార్చి 2019 (12:34 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్ర కథపై పలువురు పలు విధాలుగా ఊహించుకుంటూ వస్తున్నారు. దీంతో దర్శకుడు తాను తీస్తున్న కథపై క్లారిటీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. 
 
ఇందులో రాజమౌళి ఈ చిత్ర కథను వివరించారు. ''ట్రిపుల్ కథ కొమరం భీమ్, అల్లూరు సీతారామరాజులు స్వాతంత్ర్య పోరాటానికి ముందు జరిగి కథ అని చెప్పారు. ముఖ్యంగా, 1897లో ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. ఆయన ఇంగ్లీషే కాదు పురాణాలూ చదివారు. యుక్త వయసులో ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. రెండు సంవత్సరాలు లేరు. తిరిగి వచ్చాక స్వాతంత్ర్యం పోరాటం మొదలు పెట్టారు. ఆయన వచ్చాక జరిగిందంతా మనకు తెలిసిందే. యుక్త వయసులోనే బ్రిటీషర్స్ చేతిలో మరణించారు. 1901లో ఆదిలాబాద్‌లో కొమరం భీం పుట్టారు. ఆయన కూడాయుక్త వయసులో ఉండగానే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆయన నిరక్షరాస్యుడిగా వెళ్లి అక్షరాస్యుడిగా తిరిగొచ్చారు. ఆయన కూడా బ్రిటీషర్స్ చేతిలో చనిపోయారు. 
 
వీరిద్దరి కథ చదువుంటే వారిద్దరి కథ ఒకేలా అనిపించింది. అందుకే ఆ ఇద్దరి మహావీరులు.. ఒకరికొకరు తెలియనివాళ్లు. ఒకే సమయంలో పుట్టడం.. ఒకే సమయంలో ఇల్లు వదిలి వెళ్లిపోవడం.. తిరిగొచ్చాక ఒకే విధంగా ఫైట్ చేయడమనేది నాకు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. అయితే ఆ ఇద్దరు మహా వీరులు ఒకవేళ కలిసుంటే.. ఒకరికొరకు స్ఫూర్తిగా నిలిస్తే.. తరువాతి కాలంలో వారిద్దరి స్నేహంతో బ్రిటీషర్స్‌పై పోరాడి ఉంటే.. ఎలా ఉంటుంది? అనేదే మా కథ. ఇది ఒక ఫిక్షనరీ స్టోరీ. ఈ సినిమా కూడా బిగ్ ప్లాట్‌ఫాం మీదే ఉంటుంది. మేము చాలా రీసెర్చ్ చేశాం. దీనికోసమే చాలా సమయం పట్టింది" అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొమరం భీమ్‌గా ఎన్టీఆర్.. అల్లూరిగా చెర్రీ.. రొమాన్స్ పండుతుంది..