Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీలను తప్పుదోవ పట్టించే విధంగా '90 ఎంఎల్' చిత్రం.. వారిద్దరిని అరెస్ట్ చేయాలి..?

స్త్రీలను తప్పుదోవ పట్టించే విధంగా '90 ఎంఎల్' చిత్రం.. వారిద్దరిని అరెస్ట్ చేయాలి..?
, శుక్రవారం, 15 మార్చి 2019 (14:56 IST)
ఓవియాపై మళ్లీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కేసు నమోదైంది. తమిళ బిగ్‌బాస్ షోతో మంచి పేరు, ప్రఖ్యాతలను పొందారు. కానీ, '90 ఎంఎల్' చిత్రంలో  ఓవియా విచ్చలవిడిగా నటించిన కారణంగా ప్రేక్షకులు ఓవియాపై మండిపడుతున్నారు.

ఎందుకంటే.. ఈ సినిమాలో ఓవియా ధూమపానం చేయడం, మద్యం తాగడం, లిప్‌లాక్ సన్నివేశాలు, సహజీవనం వంటి సన్నివేశాలు సంస్కృతి సంప్రదాయాలు మంటగలిపేలా ఉన్నాయంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
 
'90 ఎంఎల్' చిత్ర దర్శకురాలైన అనితా ఉదీప్, నటి ఓవియాలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. మళ్లీ తాజాగా తిరువేర్కాడుకు చెందిన తమిళ్‌వేందన్ అనే వ్యక్తి బుధవారం రోజున స్థానిక వెప్పేరిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 
 
ఇటీవలే పొల్లాచ్చిలో 100 మందికి పైగా విద్యార్థినులు అత్యాచారం, చిత్రవధకు గురయ్యారన్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి వాటితో ప్రేమ, పెళ్లి పేర్లతో కుట్ర పన్ని ఆ ప్రాంతానికి చెందిన నలుగురు మహిళలు చేసిన అకృత్యాలు మానవజాతికే అవమానమని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరిగేలా సినిమాలు రూపొందించడం అంతకంటే నీచంగా ఉందని చెప్పొకొచ్చారు.
 
అందుకు ముఖ్యం కారణం.. మార్చి 1వ తేదీన '90 ఎంఎల్' చిత్రం విడుదలైందని.. ఈ సినిమాలో ఓవియా సభ్యసమాజం తలదించుకునేలా నటించిందని వివరించారు. సంస్కృతిని నాశనం చేసేవిధంగా.. స్త్రీలను తప్పుదోవ పట్టించే విధంగా '90 ఎంఎల్' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు అనిత ఉదీప్, అందులో నటించిన ఓవియాలను అరెస్ట్ చేయాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లేన్‌లో చూపెట్టమంటారా..?