Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RRR సెన్సార్ పూర్తి : నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:47 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". చిత్రం ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా, దీనికి యూఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. 
 
అదేసమయంలో ఈ చిత్రం నిడివి 3 గంటల ఆరు నిమిషాల 54 సెకన్లుగా ఉంది. అంటే, విరామ సమయం కలుకుంటే దాదాపు 3.15 గంటల పాటు కొనసానుంది. ఇంత నిడివితో ప్రదర్శితమయ్యే రాజమౌళి తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. రాజమౌళి దర్శకత్వం వహించి ఇప్పటివరకు విడుదలైన చిత్రాలేవీ ఇంత నిడివిని కలిగిలేవు.
 
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ వంటివారు నటించిన ఈ చిత్రాన్ని సుమారుగా రూ.350 కోట్లకు బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. నిజానికి ఈ చిత్రం గత 2020లోనే విడుదలకావాల్సింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు దఫాలుగా వాయిదాపడుతూ చివరకు ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments