Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌లుగురు స్నేహితుల క‌థతో రోటి క‌ప‌డా రొమాన్స్

డీవీ
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (17:25 IST)
Roti Kapada Romance team
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన  ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డోస్ (టీజ‌ర్‌)కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించారు. .
 
సెకండ్‌డోస్ లో భాగంగా  విడుద‌ల చేసిన ఈ సినిమాలోని అరెరె.. అరెరె అనే లిరిక‌ల్ వీడియోకు మంచి స్పంద‌న  వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం విడుద‌ల తేదిని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. మార్చి 22న  చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. 
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు  మాట్లాడుతూ న‌లుగురు స్నేహితుల క‌థ ఇది. వారి స్నేహం, ప్రేమ‌, వారి లైఫ్ జ‌ర్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం. నేటి యువ‌త‌రాన్ని అమితంగా ఆక‌ట్టుకునే ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కుటుంబ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే భావోద్వేగాలు కూడా వున్నాయి. అభిరుచి గ‌ల నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌తో క‌లిసి  సృజన్‌ కుమార్ బొజ్జం ఈ చిత్రాన్ని ఎక్క‌డా రాజీప‌డ‌కుండా నిర్మించారు.త‌ప్ప‌కుండా ఈ చిత్రం యూత్‌కు ఓ ఫెస్ట్‌లా వుంటుంది* అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments