కొత్త పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్న హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. అతని భార్య డాక్టర్ పల్లవి వర్మ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని నిఖిల్ కుటుంబీకులు తెలిపారు.
నిఖిల్ తన ప్రియురాలు పల్లవిని 2020లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇది మొదటి సంతానం. ఈ నేపథ్యంలో నిఖిల్ తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. పిల్లవాడి ముఖం కనిపించనప్పటికీ, నిఖిల్ బిడ్డను ముద్దుపెట్టుకుంటున్నట్లు ఈ ఫోటోలో కనిపిస్తుంది.
కాగా SPYలో చివరిగా కనిపించిన నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం స్వయంభూ షూటింగ్‌లో ఉన్నాడు. ఇంకా కార్తీకేయ 2లోనూ నిఖిల్ నటిస్తున్నాడు.