Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషి ఇకలేరన్న వార్త విని గుండె పగిలినంత పని అయింది : రజనీ

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:53 IST)
బాలీవుడ్ సినీ దిగ్గజం రిషి కపూర్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఈయనకు వయసు 67 యేళ్లు. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ వచ్చిన ఆయన.. బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతిని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్వీట్ ద్వారా ధృవీకరించారు. పైగా, రిషి కపూర్ ఆత్మ‌కి శాంతి చేకూరాలని ప్రార్థించారు. 
 
ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రిషి కపూర్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "గుండె ప‌గిలినంత ప‌ని అయింది. నీ ఆత్మ‌కి శాంతి చేకూరాలి నా ప్రియ‌మైన స్నేహితుడా" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, మరో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. 
 
గొప్ప నటుడే కాదు.. మంచి మనిషి... 
బాలీవుడ్ న‌టుడు రిషీ క‌పూర్ హ‌ఠాన్మ‌ర‌ణం త‌న‌ను దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని కేంద్ర స‌మాచార ప్రసార శాఖ‌ల మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ చెప్పారు. రిషీ క‌పూర్ గొప్ప న‌టుడు మాత్ర‌మే కాద‌ని, చాలా మంచి మ‌నిషి కూడా అని ఆయ‌న‌ పేర్కొన్నారు. రిషీ క‌పూర్ మ‌ర‌ణం బాలీవుడ్‌కు తీర‌ని లోటని అభిప్రాయ‌ప‌డ్డారు. రిషిక‌పూర్ కుటుంబ‌స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు, అభిమానుల‌కు తాను మ‌న‌సారా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాని జ‌వ‌దేక‌ర్ పేర్కొన్నారు.   
 
సినీ పరిశ్రమకు భయంకరమైన వారం... 
ఇదే వారంలో మ‌రో భారతీయ సినిమా న‌టుడు మ‌ర‌ణించడం బాధాక‌రం. ఒక అద్భుతమైన నటుడు, తరతరాలుగా భారీ అభిమానులని సంపాదించుకున్న ఆయ‌న ఇలా మ‌ర‌ణించడం బాధాక‌రం. అతని కుటుంబానికి, స్నేహితులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నా సంతాపం తెలియ‌జేస్తున్నాను అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments