Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా కార్యక్రమాలతో రైస్ మిల్ మూవీ ప్రారంభం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (18:19 IST)
Rice Mill pooja
హేమంత్ కుమార్, చైతన్య అరుణ్, జూనియర్ రాజనాల, శాంతి ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న  ‘రైస్ మిల్’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బ్రహ్మాజీ పోలోజు దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. సిఎమ్ మహేష్, బి. రాజేష్ గౌడ్ నిర్మించనున్నారు. సుధాకర్ విశ్వనాధుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. పూజా కార్యక్రమానికి చిన్నపరెడ్డి, చండి ప్రసాద్, అంకయ్య, శ్రీనివాస్ గుప్తా, శ్రీనివాస్ పవన్ కుమార్ తదితరులు హాజరై.. టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
 
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘రైస్ మిల్ చిత్ర పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించడం జరిగింది. విలేజ్ లైఫ్‌కి సడెన్‌గా వచ్చే అర్బన్ లైఫ్‌కి మధ్య తేడాని బేస్ చేసుకుని ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. చరణ్ అర్జున్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ బ్లెసింగ్స్ అందిస్తారని ఆశిస్తున్నాము. ఇంకో 10, 15 రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది’’ అని తెలిపారు.
 
హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘శ్రీ మహా ఆది కళాక్షేత్రం బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోగా ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రైస్ మిల్ స్టోరీ యూత్‌ని ఆకర్షించే విధంగా ఉంటుంది. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి’’ అని అన్నారు.
 
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ‘‘దాదాపు సంవత్సరం నుండి ఈ టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. ఇది నాకు హోమ్ బ్యానర్ వంటిది. ఫోన్‌లోనే మహేష్ గారు నాకు ఈ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకు సంగీతం ఇచ్చేందుకు నేను కూడా ఎంతో ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని, సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments