Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెక్స్ట్ టార్గెట్ నా కూతురే.. నా కుటుంబాన్ని నాశనం చేశారు : రియా తండ్రి

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (10:23 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన తర్వాత అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ ఆత్మహత్యకు డ్రగ్స్ మాఫియాకు లింకు ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ప్రధాన సూత్రధారిగా తేలింది. అదేసమయంలో ఈమెకు పలువురు డ్రగ్స్ వ్యాపారులకు సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.
 
డ్ర‌గ్స్ డీల‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై రెండు రోజుల క్రితం సుశాంత్ ప్రియురాలు రియా సోద‌రుడు షోవిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. దీనిపై అతడి తండ్రి  ఇంద్రజిత్‌ చక్రవర్తి స్పందిస్తూ... తమ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశారని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.  
 
భార‌త్ కి ధ‌న్య‌వాదాలు అని ఇంద్ర‌జిత్ అన్నారు. "నువ్వు నా కుమారుడిని అరెస్టు చేశావు. అనంత‌రం అరెస్ట‌య్యే వారి జాబితాలో నా కుమార్తె కూడా ఉందని నాకు తెలుసు. ఆ త‌ర్వాత ఇంకెవరో నాకు తెలియదు" అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
ఓ మధ్య తరగతి కుటుంబాన్ని సమర్థంగా పడగొట్టేశారని ఇంద్ర‌జిత్ అన్నారు. న్యాయం జరగాలంటే వీటన్నింటినీ మనం సమర్థించాల్సి ఉంటుందంటూ విమ‌ర్శిస్తూ ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో రియాను కూడా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. డ్ర‌గ్స్ డీల‌ర్ల‌తో ఆమె చేసిన చాటింగ్ ఇప్ప‌టికే అధికారుల దృష్టికి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments