పవర్ స్టార్ ఫ్యాన్స్‌ని మరోసారి కెలుకుతున్న వర్మ

Webdunia
గురువారం, 9 జులై 2020 (12:55 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ... లాక్ డౌన్ టైమ్‌లో కూడా వరుసగా సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. క్లైమాక్స్, నగ్నం, మర్డర్.. ఇలా వరుసగా సినిమాలు తీస్తున్న వర్మ పవర్ స్టార్ అంటూ మరో సినిమాని ఎనౌన్స్ చేసాడు. ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాడు. పవర్ స్టార్ టైటిల్ మధ్యలో టీ గ్లాసు పెట్టాడు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
 
ఈ సినిమా ఎవరి గురించి తీస్తున్నాడో..? అవును.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే. అయితే... వర్మ మాత్రం తనదైన శైలిలో ఇది ఎవర్నీ ఉద్దేశించి తీస్తున్న సినిమా కాదు అని చెబుతున్నాడు. 
 
ఆ ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో ఆలోచిస్తూ కూర్చొని ఉన్నారు. ఈ పోస్టర్ పైన ఎన్నికల తరువాత కథ అని రాసి సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు.
పవర్ స్టార్ అభిమానులకు, వర్మకు మధ్య విభేదాలు గత కొన్ని రోజులుగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఓసారి ఇక నుంచి మెగా హీరోల గురించి ఎలాంటి ట్వీట్లు చేయడం కానీ.. మాట్లాడటం కానీ చేయను అని చెప్పారు. ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి పవర్ స్టార్ అంటూ వివాదస్పద చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.
 
ఈ సినిమాతో మరోసారి వర్మ పవన్ అభిమానులను కెలుకుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి... ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నాడో? ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి వివాదాలు వస్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం