Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ డైరెక్టర్‌కు మీరు బ్రేక్ ఇస్తే.. ఆయన కొత్తవారి కెరీర్‌ను బ్రేక్ చేస్తున్నారు...

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై యువ రచయిత జయకుమార్ ఆరోపణలు గుప్పిచారు. పైగా, తనకు న్యాయం చేయాలంటూ టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు విజ్ఞప్తి చేశాడు. ఇంతకీ రాంగోపాల్ వర్మ చేసిన పనేంటో పరిశీలిద్ధాం.

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (15:39 IST)
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై యువ రచయిత జయకుమార్ ఆరోపణలు గుప్పిచారు. పైగా, తనకు న్యాయం చేయాలంటూ టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు విజ్ఞప్తి చేశాడు. ఇంతకీ రాంగోపాల్ వర్మ చేసిన పనేంటో పరిశీలిద్ధాం.
 
నాగార్జున - రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం శివ. ఈ చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి చిత్రాన్ని నిర్మించలేదు. కానీ, ఇపుడు అంటే 25 యేళ్ల తర్వాత రెండో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి "ఆఫీసర్" అనే టైటిల్ పెట్టారు. అయితే, ఈ చిత్ర కథపై ఇపుడు వివాదం చెలరేగింది. 
 
నిజానికి ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల విడుద‌లను వ‌చ్చే నెల ఒక‌టో తేదీకి వాయిదా వేశారు. దీనికి కారణఁ విడుద‌ల‌కు ముందే ఈ సినిమా ప‌లు వివాదాల‌ను ఎదుర్కోవడమే. 
 
"ఆఫీస‌ర్'' సినిమా క‌థ‌ను త‌న నుంచి వ‌ర్మ కాపీ చేశాడ‌ని ర‌చ‌యిత జ‌య‌కుమార్ ఆరోపించారు. 'ఆఫీస‌ర్' క‌థ ఇదేనంటూ ఓ క‌థ‌ను జ‌య‌కుమార్ సోష‌ల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. తాజాగా జ‌య‌కుమార్.. త‌న‌కు న్యాయం చేయాలంటూ ఈ సినిమా హీరో నాగార్జున‌ను ట్విట‌ర్ ద్వారా రిక్వెస్ట్ చేశాడు. 'నాగార్జున గారూ.. స‌ద‌రు డైరెక్ట‌ర్ గారికి మీరు బ్రేక్ ఇచ్చారు. కానీ ఆయ‌న కొత్తవాళ్ల కెరీర్‌ను బ్రేక్ చేస్తున్నాడు. ద‌య చేసి న్యాయం చేయండి' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
అయితే, ఈ వివాదంపై దర్శకుడు వర్మ కూడా స్పందించారు. ఇది సినిమా స్టోరీ కాదని, ఓ ఐపీఎస్ అధికారి నిజ జీవితం అని, ఆ అధికారి చెప్పిన కొన్ని విషయాలతోనే ఈ స్టోరీ తయారైందని వర్మ తన ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. నాగార్జునతో నేను చేసిన ఆఫీసర్ సినిమా కర్ణాటకకు చెందిన కె.ఎమ్. ప్రసన్న అనే ఒక నిజమైన ఐపీఎస్‌ అధికారిది అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments