Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కా ప్లాన్ ప్రకారమే శ్రీదేవిని చంపేశారు: మాజీ ఏసీపీ

అందాల సినీ నటి శ్రీదేవిని పక్కా ప్లాన్‌తో చంపేశారనీ ఢిల్లీకి చెందన మాజీ వేద్‌భూషణ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. శ్రీదేవి మృతిపై ఈయన చేసిన

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (15:21 IST)
అందాల సినీ నటి శ్రీదేవిని పక్కా ప్లాన్‌తో చంపేశారనీ ఢిల్లీకి చెందన మాజీ వేద్‌భూషణ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. శ్రీదేవి మృతిపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివావాదస్పదమయ్యాయి.
 
నటి శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయినప్పుడు శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని తొలుత దుబాయ్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించగా బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు తేలింది. 
 
ఈనేపథ్యంలో వేద్‌భూషణ్ స్పందిస్తూ, 'బాత్‌టబ్‌లో బలవంతంగా ముంచి చంపడం చాలా సులువు. అలా చేస్తే మునిగి చనిపోయారని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోలేదు. ఆమెను పథకం ప్రకారం చంపేశారని నాకు అనిపిస్తోంది. దుబాయ్‌ వైద్యులు ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపై నాకు సందేహాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం' అని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
కానీ ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆమె మృతి విషయంలో తాము కలగజేసుకోలేమని తేల్చి చెప్పింది. కాగా, పదవీ విరమణ పొందాక భూషణ్‌ దిల్లీలో ఓ ప్రైవేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీని నడుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments