Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుకుమార్ విడుద‌ల చేసిన SR క‌ళ్యాణమండంపం పాట‌కు స్పంద‌న‌

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (11:40 IST)
Kiran Abbavaram
`రాజావారు రాణిగారు` ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం, `టాక్సీవాలా` ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై రూపొందుతోన్నచిత్రం SR క‌ళ్యాణమండంపం EST 1975. ప్ర‌మోద్, రాజు నిర్మాత‌లుగా నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా ఇది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన `చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార` వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఇటీవ‌లే త‌మ‌ చిత్రాన్ని మాత్రం థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవ‌లే శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు.
 
ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే, ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి మ‌రో పాట‌ విడుద‌లైంది. `సిగ్గేందుకు రా మావ` అంటూ సాగే ఈ పాట‌ను స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ విడుద‌ల చేశారు. ఈ పాట‌లో హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం డాన్స్ మూమెంట్స్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి, అలానే సంగీత ద‌ర్శ‌కుడు ఈ పాట‌కు అందించిన ట్యూన్స్, ప్ర‌ముఖ సింగర్ అనురాగ్ కుల‌కుర్ణి అద్భుత‌మైన వాయిస్ వెర‌సి సిగ్గేందుకు రా మావ పాట‌ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందించ‌డం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments