Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ అంతా చీకటిగానే అనిపిస్తుంది.. రేణూ దేశాయ్

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (13:34 IST)
మెగా ఫ్యామిలీ ఇంటి పెళ్లి భజంత్రీలు మోగిన వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైవాహిక బంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా, కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ అంతా చీకటిగానే అనిపిస్తుదంటూ రేణూ దేశాయ్ కామెంట్స్ చేస్తూ, పేర్లు ప్రస్తావించకుండానే నిహారిక - చైతన్య కొత్త దంపతులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. 
 
కాగా, రేణూ దేశాయ్ చేసిన ఓ వీడియో సందేశాన్ని పరిశీలిస్తే, కాబోయే జీవిత భాగస్వామితో రిలేషన్ షిప్ ను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైనా ఉంటుందని చెప్పుకొచ్చారు. చాలా సార్లు చాలా మంది తమ భర్త మంచిగా లేరని తెలిసి కూడా అతనితో మంచిగా ఉండేందుకే ప్రయత్నిస్తారని చెప్పిన రేణూ దేశాయ్, అది భారతీయ మహిళలకు  అలవాటై పోయిందని వ్యాఖ్యానించారు. 
 
ఏ వివాహమైనా బ్రేకప్ అయిందంటే, దానికి ఏదో ఒక కారణం ఉంటుందని, దాన్ని కర్మ అని కూడా అనుకోవచ్చని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ముందడుగు వేయాలని అన్నారు. తాను ఈ అడుగులన్నీ వేసుకుంటూనే వచ్చానని, అందరి ఆశీర్వాదంతో కొత్త జంట జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నానని ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండానే నిహారిక, చైతన్య దంపతులకు తన విషెస్ అందించారు. 
 
కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వేళ ఎంతో చీకటిగా అనిపిస్తుందని, కానీ ఆ చీకటి నుంచి మానసిక దృఢత్వం, స్వయంకృషితోనే బయటకు రావాలని అభిలషించారు. ఎవరో వచ్చి సాయం చేస్తారని అనుకోవద్దని, వారు సాయం చేసినా, ఎవరికి వారే సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి వుండాలని సూచించారు. రేణు దేశాయ్ విడుదల చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments