Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ "లైగర్" టీజర్ రిలీజ్ వాయిదా

Webdunia
ఆదివారం, 9 మే 2021 (11:51 IST)
మే 9వ తేదీ యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం 'లైగ‌ర్' టీజ‌ర్ విడుద‌ల అవుతుంద‌ని అంతా భావించారు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో మూవీ టీజ‌ర్‌ను వాయిదా వేస్తున్న‌ట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. 
 
"మే 9న లైగ‌ర్ ప‌వర్ ప్యాక్ట్ టీజ‌ర్ రిలీజ్ చేద్దామ‌ని అనుకున్నాం. కాని ఈ సంక్షోభ స‌మ‌యంలో టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం క‌న్నా, వాయిదా వేయ‌డ‌మే మంచిద‌నిపించింది. చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌తంలో ఎన్న‌డు క‌నిపించ‌ని లుక్‌లో మెరవ‌నున్నాడు. త‌ప్ప‌క అభిమానుల‌ని అల‌రిస్తాడు.
 
ఇలాంటి ప‌రిస్థితుల‌లో బ‌య‌ట తిర‌గ‌కుండా ప్ర‌తి ఒక్క‌రు ఇంటి ప‌ట్టునే ఉండండి. త‌ప్ప‌క వ్యాక్సిన్ వేయించుకోండి. వైద్యులు చెబుతున్న సూచ‌న‌లు పాటిస్తూ అంద‌రు జాగ్ర‌త్త‌గా ఉండండి. ప‌రిస్థితులు అన్ని కుదుట‌పడ్డాక లైగర్ మిమ్మ‌ల్ని ఎంట‌ర్ టైన్ చేసేందుకు వ‌స్తాడ‌ని" ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్, పూరీ కనెక్ట్స్ ప్ర‌క‌టించాయి. 
 
కాగా, ఈ కొత్త చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం నేషనల్ లెవెల్ బాక్సర్‌గా ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇంటర్నేషనల్ హై వోల్టేజ్ బాక్సర్‌గా కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అన‌న్య పాండే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments