ఒక్క సినిమా దేశంలో ఒకడున్నాడని తెలియజేసింది. అతనే విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా విడుదలకు ఎన్ని అడ్డంకులు వచ్చాయో తెలిసిందే. ఎట్టకేలకు విడుదలై దేశంలో యువతను ఊపేసింది. ఆ సినిమాతో విజయ్ పేరు మారుమోగిపోయింది. అప్పటినుంచి ఇన్ స్టాలో తన అప్‌డేట్‌ను పెడుతుండేవాడు. అయితే ఇటీవలే విజయ్ ఇన్ స్టాను ఫాలో అయిందట కత్రినా కైఫ్. బాలీవుడ్ నటులకు తీసిపోనివిశంగా వున్నాడంటోంది.
ఇప్పుడు పూరీ జగన్నాథ్‌తో `లైగర్` సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ 75శాతం ముంబైలోనే జరిగింది. కరోనా కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ కాస్త ఆలస్యమైంది. లేదంటే ఈనెలలో విడుదల కావాల్సి వుంది. చార్మి కూడా నిర్మాత కావడంతో ఆ సినిమాకు పెద్ద ప్రమోషన్ వచ్చింది. ఈ సినిమా స్టిల్స్ కత్రినాను ఆకట్టుకున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజయ్ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాలో క్రతినానే హీరోయిన్ అయ్యే ఛాన్స్ వున్నాయంటూ ఫిలింనగర్ కథనాలు చెబుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.