పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం గుండె కథ వింటారా. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి శ్రీరామనవమి శుభాకాంక్షలతో `ఎంత బావుందో...` లిరికల్ సాంగ్‌ని విజయ్‌దేవరకొండ రిలీజ్‌చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
`ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా...గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
తారాగణం:
మధునందన్, స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: వంశీధర్
నిర్మాతలు : క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప
బ్యానర్: ట్రినిటి పిక్చర్స్
సినిమాటోగ్రఫి: రవి వర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్
సంగీతం: మసాల కాఫీ
ఎడిటర్: సాయి కిరణ్ ముద్దం
యాక్షన్: `రియల్` సతీష్
కొరియోగ్రఫి: భాను మాస్టర్
లిరిక్స్: కృష్ణ చైతన్య
కాస్ట్యూమ్ డిజైనర్: గౌరీ నాయుడు