Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్ష‌న్ కోసం శిక్ష‌ణ తీసుకుంటున్న రెజీనా, నివేద‌

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (16:33 IST)
Rejina- Niveda
ఈమ‌ధ్య న‌టి రెజీనా పెద్ద‌గా సినిమాల్లో క‌నిపించ‌డంలేదు. నివేదా థామ‌స్ మ‌టుకు `వ‌కీల్‌సాబ్‌`లో క‌నిపించింది. ఇప్పుడు వీరిద్ద‌రినీ క‌లిపి ఓ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేస్తుంది సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌. ఇప్ప‌టినే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫిలింఛాంబ‌ర్‌లో రిజిష్ట‌ర్ అయింది. శాఖినీ, ఢాకినీగా పేరు ఖ‌రారు చేశారు. అయితే ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించాల్సి వుంది. కాగా, ఈ సినిమా కొరియిన్ మూవీకి సంబంధించింది. ఆమ‌ధ్య స‌మంత న‌టించిన కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`ని ఓ బేబీగా నిర్మించి మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు 2017లో విడుద‌లైన కొరియ‌న్ మూవీ `మిడ్ నైట్ ర‌న్న‌ర్స్`ని తెలుగులో శాఖినీ, డాకినీగా తీస్తున్నారు.
 
ఇందులో క‌థాప‌రంగా ఇద్ద‌రు పోలీసు ఆఫీసర్ల క‌థ‌. తెలుగు నేటివిటీకి కొంత మార్పుచేసి తెర‌కెక్కిస్తున్నారు. క‌థ ప్ర‌కారం కొరియ‌న్ యాక్ష‌న్ ఎపిసోడ్ చేయాల్సివుంది. అందుకే అందుకు సంబంధించిన యాక్ష‌న్ పార్ట్ కోసం ఇద్ద‌రూ శిక్ష‌ణ తీసుకుంటున్నారు. ఈ సినిమాను డి. సురేష్ బాబు, సునీత తాటి నిర్మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. స్వామి రారా` ఫేమ్ సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments