Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ఏం చేయమన్నా చేస్తా... రెజీనా కెసాండ్రా

Webdunia
సోమవారం, 9 మార్చి 2020 (12:23 IST)
టాలీవుడ్ యువ హీరోయిన్లలో రెజీనా ఒకరు. పలు హిట్ చిత్రాల్లో నటించింది. కానీ, ఆమెకు సరైన అవకాశాలు లభించలేదు. దీంతో అడపాదడపా లభించే చిత్రాల్లో నటిస్తూ తన సినీ జీవితాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ఓ ఐటమ్ సాంగ్‌లో రెజీనా నటించేందుకు సమ్మతించింది. ఈ పాటను కూడా ఇటీవలే చిత్రీకరించారు. 
 
ఈ విషయం లీక్ కావడంతో రెజీనా స్పందించారు. 'నేను డాన్స్ చేయ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌తాను. అది కూడా చిరంజీవిగారితో అంటే ఇక చెప్పేదేముంది. అందుక‌నే అడ‌గ్గానే మ‌రో ఆలోచ‌న లేకుండా ఓకే చెప్పేశాను. ఈ అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌. ఆరు రోజుల పాటు ఈ పాట‌ను చిత్రీక‌రించారు. 
 
చిరంజీవిగారి డాన్స్ చూసి చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఆయ‌న నేను డాన్స్ చాలా బాగా చేస్తున్నాన‌ని అభినందించారు. అంత పెద్ద స్టార్ న‌న్ను అభినందించ‌డం చాలా హ్యాపీగా అనిపించింది' అని అన్నారు. 
 
అలాగే త‌న సాంగ్‌ను ఐటెట్ సాంగ్ అని కాకుండా సెల‌బ్రేష‌న్ సాంగ్ అనాల‌ని కూడా కోరింది. అలాగే ఇలాంటి స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం ఇదే తొలిసారి..ఇదే చివ‌రిసారి అని కూడా తేల్చి చెప్పేసింది. కాగా, ఆచార్య చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments