Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భ‌ర‌త్ అనే నేను' ఫంక్ష‌న్‌కి తార‌క్‌ని పిల‌వ‌డం వెనక ఏం జ‌రిగింది..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ సెన్సేష‌న్ భ‌ర‌త్ అనే నేను. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన‌ ఆడియోను హైద‌రాబాదులో భారీ స్ధ

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (21:45 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ సెన్సేష‌న్ భ‌ర‌త్ అనే నేను. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన‌ ఆడియోను హైద‌రాబాదులో భారీ స్ధాయిలో ఘ‌నంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్‌కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రు కావ‌డం విశేషం. 
 
అస‌లు ఆడియో ఫంక్ష‌న్‌కి ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది అని కొర‌టాల శివ‌ని అడిగితే అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.... ఫంక్షన్ హైదరాబాదులో చేయాలని అనుకున్న తరువాత, సంవత్సరం మొత్తం మన ఫేస్‌లే చూసుకున్నాం. సినిమా ఫంక్షన్‌కు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది కదా?" అని మహేష్ అన్నార‌ట‌. 
 
ఎవరిని పిలవాలని ఆలోచిస్తున్న సమయంలో ఆయనే తారక్‌ను పిలుద్దామా? అని అడిగారట‌. వెంటనే కొర‌టాల‌ ఫంక్షన్ గురించి చెప్పి, తారక్‌ను ఆహ్వానిస్తే, ఊరుకోండి... జోక్ చేస్తున్నారా? అని అన్నాడట‌. జోక్ కాదు.. నిజంగా రావాలని కోరితే, అంగీకరించి, రెండు గంటల పాటు తాను కూడా ఎంజాయ్ చేస్తానని చెప్పాడట‌. ఎన్టీఆర్ రావడం తమ ఫంక్షన్‌కు ప్లస్ పాయింట్ అయిందని చెబుతూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు కొర‌టాల‌.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments