Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో లైగర్‌: టేబుల్‌పై కాలుపెట్టిన విజయ్ దేవరకొండ.. అసలు ఏం జరిగింది.?

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (15:13 IST)
Liger
హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో కొందరు తెలుగు జర్నలిస్టులతో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య చిట్ చాట్ జరిగింది. ఈ సందర్భంగా లైగర్ మూవీకి సంబంధించి విషయాలను ప్రస్తావించారు. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్న సమయంలో విజయ్‌ టేబుల్‌పై ఇలా తన రెండు కాళ్లు పెట్టాడు. 
 
అంతే.. ఆ వీడియోను చూసిన కొంతమంది విజయ్ దేవరకొండపై భారీగా ట్రోల్స్ చేశారు. పాన్‌ ఇండియా హీరో అయ్యే సరికి విజయ్‌కు పొగరు పెరిగిందని అనేక మీడియా వెబ్‌సైట్స్‌, సోషల్‌మీడియాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.
 
దీనిపై ఆ ప్రెస్‌మీట్లో ఉన్న ఒక విలేకరి స్పందించాడు. అసలు ఆరోజు ఏం జరిగిందో వివరించాడు. విజయ్‌ దేవరకొండను తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నాడు. ఆయన మాతో ఎంతో సరదాగా ఉంటారని తెలిపారు.  
 
మీతో ఫ్రెండ్లీగా మాట్లాడాలంటే కొంచెం బెరుకుగా ఉందన్నారు. అప్పుడు విజయ్ ఆ విలేకరిలోని భయాన్ని పొగొట్టేందుకు మీరు అవన్నీ పట్టించుకోవద్దన్నాడు. 
 
మనమంతా సరదాగా మాట్లాడుకుందామన్నాడు. మీరు కాలు మీద కాలేసుకుని కూర్చొండని, తానూ కాలు మీద కాలేసుకుని కూర్చొంటానని ఫ్రెండ్లీగా అనేశారు. విజయ్‌ అలా అనడంతో అక్కడివారంతా నవ్వుకున్నారని అసలు విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments