Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోటీకి సై అంటున్న డిస్కోరాజా... ఇంత‌కీ పోటీ ఎవ‌రితో..?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (20:40 IST)
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే ఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత రామ్ తల్లూరి ప్రకటించారు.  
 
అలాగే సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నారు. మహారాజా రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ తళ్లూరి నిర్మాణంలో, సాయి రిషిక సమర్పణలో, రజిని తళ్లూరి ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా నిర్మిస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత రామ్ తల్లూరి చిత్ర విశేషాల‌ను తెలియ‌చేస్తూ... ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఢిల్లీలోని విభిన్నమైన ప్రాంతాల్లో, లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్, హాట్ బ్యూటీ తాన్యాహోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ హంగులతో, గ్రాఫిక్స్‌కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నాం.
 
థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్  కామెడీతో ప్రేక్షకలకు నవ్వుల విందు పంచనున్నాడు, బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. 
 
ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ప్రీ లుక్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. టైటిల్‌కు తగ్గట్టుగా డిస్కోరాజా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుందని ధీమాగా చెప్పగలం అని అన్నారు. ఇంత‌కీ పోటీ ఎవ‌రితో అంటే.... డిసెంబ‌ర్‌లో భీష్మ అంటూ నితిన్ వ‌స్తున్నాడు. డిస్కోరాజా కూడా క్రిస్మ‌స్ పైనే క‌న్నేసాడు. దీంతో మ‌రింత ఆస‌క్తి పెరిగింది. మ‌రి... ఈ పోటీలో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments