మాస్ మహారాజా రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో ట్రాక్ వచ్చాడు. కానీ... ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ మొదటకొచ్చింది. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసాడు.
అయితే... రవితేజ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉండటం వలన బడ్జెట్ తగ్గిద్దామని నిర్మాత చెప్పాడట. ఈ సినిమాని దాదాపు 30 కోట్లలో పూర్తి చేయాలి అని నిర్మాత అన్నారట. రవితేజ మాత్రం అంతకన్నా ఎక్కువు అవచ్చు. తక్కువ చేయమనడం ఏంటి అని ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదట. అందుచేతనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం.
దీంతో రవితేజతో సినిమాలు చేసేందుకు యువ దర్శకులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. సంపత్ నంది, మలినేని గోపీచంద్, అజయ్ భూపతి... తదితర యువ దర్శకులు రవితేజకు కథలు చెప్పేందుకు రెడీ అవుతున్నారట.
వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడం... సెట్స్ పైకి వెళుతుంది అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోవడంతో... రవితేజ ఆలోచనలో పడ్డాడట. వెంటనే సినిమా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకనే ఎవరైనా కథ చెబుతాను అంటే వెంటనే ఓకే అంటున్నాడట. పాపం... రవితేజకు ఎంత కష్టం వచ్చింది.